భారతీయుడికి కళ్ళు చెదిరే లాటరీ..లక్కంటే ఇదీ..!!
TeluguStop.com
అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో తెలియదు, కొంతమందికి తలుపు తీసేవరకూ తడుతూనే ఉంటుంది.
మరి కొందరికి అదృష్టం ఆమడ దూరాన ఉంటుంది ఏది ఏమైనా సరే లక్కనేది ప్రతీ మనిషి జీవితాన్ని ఓ మలుపు తిప్పుతుంది.
ఆర్ధిక భారంతో కుంగిపోతున్న సమయంలో లక్ష రూపాయలు వచ్చి పడితే ఎలా ఉంటుంది.
అలాంటి ఘటనే విదేశంలో ఉన్న భారతీయుడు తలరాతని మార్చేసింది.కష్టసమయంలో ఉన్న గురుప్రీత్ సింగ్ అనే వ్యక్తికి రూ.
17 కోట్ల రూపాయల భారీ లాటరీ తగిలింది.ఏంటి షాక్ అయ్యారా సరే అసలు మ్యాటర్ లోకి వెళ్దాం.
పంజాబ్ కి చెందిన గురుప్రీత్ సింగ్ 32 ఏళ్ళుగా యూఏఈ లోనే తన కుటుంభంతో ఉంటున్నాడు.
షార్జాలో ఉద్యోగం చేస్తున్న గురుప్రీత్ సింగ్ కు లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేయడం అలవాటు అయ్యింది.
అందుకు కారణం లేకపోలేదు.తల్లి తండ్రులు , కుటుంభంతో కలిసి షార్జాలోనే ఒక సింగిల్ బెడ్ రూమ్ లో ఉంటున్నారు.
దాంతో తల్లి తండ్రులు అతడి ఇబ్బంది చూడలేక భారత్ వచ్చేశారు.ఉద్యోగం చేస్తూనే లాటరీ ద్వారా జాక్ పాట్ కొట్టాలని ఏళ్ళుగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే అబుదాబి బిగ్ టిక్కెట్ రాఫెల్ లో టిక్కెట్టు కొనుగోలు చేశాడు.
కరోనా కారణంగా ఈ సంస్థ నిర్వాహకులు ఆన్లైన్ లో డ్రా నిర్వహించారు.ఈ డ్రా లో రూ.
17 కోట్ల రూపాయలు గురుప్రీత్ సింగ్ గెలుచుకున్నాడు.అయితే ఈ డ్రా విషయం అతడికి తెలియదు.
లాటరీ నిర్వాహకులు ఫోన్ చేసి ఈ విషయం చెప్పగా స్నేహితులు ఆట పట్టిస్తున్నారని భావించారు.
కానీ స్థానిక వార్తా చానల్స్ లో విషయం తెలుసుకుని నిర్వాహకులును కలిసాడు గురుప్రీత్ సింగ్.
ఇక తన తల్లి తండ్రులని మళ్ళీ తన వద్దకి తెచ్చుకుంటానని మంచి ఇల్లు కొంటానని, పిల్లలకి మంచి చదువు చెప్పిస్తానని తన కలల సామ్రాజ్యాన్ని విస్తరిస్తానని అంటున్నాడు.
మరి ఇతడు అదృష్టవంతుడే కదా.
ఈ సింపుల్ చిట్కా పాటిస్తే మీ ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు!