బ్రిటన్‌లో సత్తా చాటిన భారత సంతతి వ్యాపారవేత్త.. మేయర్‌గా ఎన్నిక, వరుసగా రెండోసారి..!!

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వలస వెళ్లిన భారతీయులు ఇప్పుడు ఆయా దేశాలను శాసించే స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే.

డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులుగా కీలక హోదాల్లో వున్నారు.ఇక పలు దేశాల్లో జరిగే ఎన్నికల్లో భారతీయులు నిర్ణయాత్మక శక్తిగా వున్న సంగతి తెలిసిందే.

తాజాగా బ్రిటన్‌Britain‌లోని ఓ నగరానికి మేయర్‌గా భారతీయుడు ఎన్నికయ్యాడు.అది కూడా వరుసగా రెండోసారి.

వివరాల్లోకి వెళితే.లండన్ బరో ఆఫ్ సౌత్‌వార్క్ మేయర్‌గా భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త సునీల్ చోప్రా రెండోసారి ఎన్నికయ్యారు.

అనంతరం సెంట్రల్ లండన్‌లోని సౌత్ వార్క్ కేథడ్రల్, మాంటేగ్ క్లోజ్‌లో శనివారం మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.

సునీల్ చోప్రా 2014-15లో లండన్ బరో ఆఫ్ సౌత్‌వార్క్‌కు మేయర్‌గా పనిచేశారు.అంతకుముందు 2013-14లో డిప్యూటీ మేయర్‌గా విధులు నిర్వర్తించారు.

అంతేకాకుండా బరో మేయర్‌గా ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగానూ సునీల్ చోప్రా రికార్డుల్లోకెక్కారు.

యూకే లేబర్ పార్టీ.చోప్రా నాయకత్వంలో లండన్ బ్రిడ్జ్, వెస్ట్ బెర్మాండ్సే స్థానాల్లో లిబరల్ డెమోక్రాట్‌లపై విజయం సాధించింది.

లండన్ బరో ఆఫ్ సౌత్‌వార్క్ కౌన్సిల్‌లో కేవలం 2 శాతం మంది మాత్రమే భారత సంతతి ప్రజలు వున్నందున సునీల్ చోప్రా విజయం ప్రాధాన్యత సంతరించుకుంది.

2010లో యూకే రాజకీయాల్లో ప్రవేశించిన ఆయన.2014లో తొలిసారి లండన్ బరో ఆఫ్ సౌత్‌వార్క్‌కు మేయర్‌గా ఎన్నికయ్యారు.

అలాగే మూడు సార్లు డిప్యూటీ మేయర్‌గా కూడా పనిచేశారు.అంతకుముందు భారత్‌లో వున్నప్పుడు కూడా సునీల్ చోప్రా 1970వ దశకంలో ఢిల్లీ రాజకీయాల్లో క్రీయాశీలకంగా వ్యవహరించారు.

1972లో ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కాలేజ్ ఆఫ్ వోకేషనల్ స్టడీస్‌కి తొలి అధ్యక్షుడిగా వ్యవహరించారు.

ఎల్ఎల్‌బీ చదువుతున్నప్పుడు 1973-74లో ఢిల్లీ యూనివర్సిటీలో సుప్రీం కౌన్సిలర్‌గా పనిచేశారు.తర్వాత నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్‌యూఐ) ఢిల్లీ విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు.

"""/" / 1979లో యూకే వలస వెళ్లిన సునీల్ చోప్రా ఒక రిటైల్ ఎంటర్‌ప్రైజ్ దుకాణాన్ని ప్రారంభించారు.

అనతికాలంలోనే అది హోల్‌సేల్ వ్యాపారంగా ఎదిగింది.వ్యాపారంలో బిజీగా వున్నప్పటీకి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా భారతీయ సంస్కృతిని ప్రోత్సహించేవారు.

ఆ ప్రాంతంలో భారతీయ కమ్యూనిటీ కోసం ఆయన సౌత్‌వార్క్ హిందూ సెంటర్ అనే సంస్థను స్థాపించారు.

వృద్ధురాలి కాళ్లకు నమస్కరించి సెల్ఫీ ఇచ్చిన విజయ్ సేతుపతి.. గ్రేట్ అంటూ?