కాబోయే భార్య దారుణ హత్య .. భారతీయుడికి జీవిత ఖైదు, ఇండియాలోనే శిక్ష అనుభవిస్తానంటూ
TeluguStop.com
యూకేలో కాబోయే భార్యను హత్య చేసిన కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు పడిన భారతీయుడిని భారతదేశానికి రప్పించారు.
గుజరాత్‌లోని సూరత్‌కు( Surat In Gujarat ) చెందిన 24 ఏళ్ల భారత సంతతి వ్యక్తి జిగు సోర్తి 2020లో తనకు కాబోయే భార్య భవినీ ప్రవీణ్‌ను( Bhavini Praveen ) యూకేలోని లీసెస్టర్‌లోని ఇంట్లో విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు.
ఈ ఘటనలో బాధితురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.ఈ కేసులో దోషిగా తేలిన జిగుకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించగా.
నాలుగేళ్లుగా యూకేలోని జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు.మిగిలిన శిక్షను అనుభవించేందుకు గాను తనను భారత్‌లోని సూరత్ జైలుకు బదిలీ చేయాల్సిందిగా సోర్తి ( Sorthi )కోరగా లీసెస్టర్ న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది.
కోర్టు ఆదేశాల మేరకు జిగు సోర్తిని ఢిల్లీ విమానాశ్రయానికి తరలించగా.అక్కడి నుంచి గుజరాత్ పోలీస్ ప్రత్యేక బృందం అతనిని తీసుకుని భద్రత మధ్య లాజ్‌పూర్ జైలుకు తరలించింది.
"""/" /
కాగా.జిగు - ప్రవీణ్‌ల జంట 2017లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.
అయితే మృతురాలి తల్లిదండ్రులు మాత్రం జిగుతో పెళ్లికి అభ్యంతరం తెలపడంతో పాటు అతనికి దూరంగా ఉండాలని సూచించారు.
ఈ క్రమంలో భవినీ ప్రవర్తనలో మార్పులు రావడంతో వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి.
దీంతో యూకేలో ఉన్నప్పుడే జిగుతో భవిని పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది.ఈ పరిణామాల నేపథ్యంలో భవినీని తన ఇంట్లోనే దారుణంగా హత్య చేశాడు జిగు.
అనంతరం లీసెస్టెర్ షైర్ పోలీస్ స్టేషన్ వెలుపల ఓ అధికారిని కలిసి తాను హత్య చేసినట్లు చెప్పి లొంగిపోయాడు.
"""/" /
ఇదిలాఉండగా .ఇటీవల యూకేలోని ఓ ప్రాంతంలో కారులో శవమై తేలిన భారత సంతతి వివాహిత హత్య వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
మృతురాలు హర్షిత బ్రెల్లా మరణంపై అన్ని వేళ్లూ ఆమె భర్త పంకజ్ లాంబా వైపే చూపిస్తున్నాయని నార్తాంప్టన్‌షైర్ పోలీసులు అంటున్నారు.
హర్షిత సోదరి సోనియా మాట్లాడుతూ.పెళ్లి సమయంలో పెద్ద మొత్తంలో బంగారం, డబ్బు ఇచ్చినప్పటికీ లంబా కుటుంబం తమ నుంచి కట్నం డిమాండ్ చేసిందని తెలిపారు.
కట్నం కోసమే పంకజ్ తన సోదరిని హత్య చేసి ఉంటాడని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది మార్చి 22న పంకజ్ - హర్షితల వివాహం జరిగిందని.పెళ్లయిన నాటి నుంచి అతను కట్నం కోసం వేధిస్తూనే ఉన్నాడని సోనియా ఆరోపించారు.
సినిమాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పై స్పందించిన పవన్!