అమెరికా : ర్యాష్ డ్రైవింగ్‌తో ఇద్దరు టీనేజర్ల బలి.. భారత సంతతి వ్యక్తికి కోర్టులో చుక్కెదురు

ర్యాష్ డ్రైవింగ్‌తో ఇద్దరు టీనేజర్ల మరణానికి కారణమైన కేసులో భారత సంతతి డ్రైవర్‌కు అమెరికా కోర్టు బెయిల్‌ను నిరాకరించింది.

ఇదే ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు కూడా.ఈ కేసుకు సంబంధించి బ్రూక్లిన్ అప్పీల్ కోర్టులో ప్రాసిక్యూటర్లు మాట్లాడుతూ.

నిందితుడు అమన్‌దీప్ సింగ్ ( Amandeep Singh )(34) ప్రమాద సమయంలో కొకైన్ సేవించి ఆ మత్తులోనే దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో తన ట్రక్కును నడిపినట్లు ఆధారాలు లభించాయని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేరానికి సంబంధించి అమన్‌దీప్ సింగ్‌‌పై పలు అభియోగాల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.

దుర్ఘటన జరిగిన నాలుగు గంటల తర్వాత టాక్సికాలజీ( Toxicology ) నివేదికల్లో నిందితుడు 0.

15 శాతం బ్లడ్ ఆల్కహాల్ స్థాయిని కలిగి వున్నట్లు తేలిందన్నారు.ఇది చట్టం నిర్దేశించిన పరిమితి కంటే రెట్టింపు అని నసావు కౌంటీ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అటార్నీ జనరల్ మైఖైల్ బుష్వాక్( Michael Bushwack ) కోర్టుకు తెలియజేశారు.

ఈ సందర్భంగా బెయిల్ పిటిషన్‌పైనా ప్రాసిక్యూటర్లు వాదనలు వినిపించారు.అమన్‌దీప్‌కు బెయిల్ ఇవ్వొద్దని వారు కోరారు.

ఘటనాస్థలి నుంచి సేకరించిన సీసీ కెమెరా ఫుటేజ్, ప్రమాదానికి ముందు సింగ్ రెండు బార్‌లలో మద్యం సేవించినట్లు ధ్రువీకరించే రశీదులను కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు.

"""/" / దీనిపై డిఫెన్స్ ప్రాసిక్యూటర్ స్పందిస్తూ.తన క్లయింట్ దేశం విడిచి పారిపోడని తెలిపారు.

అతనికి 1 మిలియన్ డాలర్ల పూచీకత్తుపై బెయిల్, జీపీఎస్ పర్యవేక్షణతో గృహ నిర్బంధాన్ని మంజూరు చేయాలని కోర్టును కోరాడు.

దీనితో పాటే అమన్‌దీప్ సింగ్ తన అమెరికన్, భారతీయ పాస్‌పోర్ట్‌లను కోర్టుకు అప్పగిస్తాడని ఆయన చెప్పారు.

భార్యా ఇద్దరు పిల్లలతో వుంటున్న సింగ్ .విజయవంతమైన కాంట్రాక్టర్ అని, అతను 35 మందికి ఉపాధి కల్పిస్తున్నారని, స్థానిక పాఠశాలలతోనూ ఒప్పందాలు వున్నాయని అటార్నీ కోర్ట్‌కు తెలియజేశారు.

అయితే ప్రాసిక్యూటర్లు మాత్రం.అమన్‌దీప్ ప్రమాదస్థలి నుంచి పారిపోవడం, పార్కింగ్ ప్లేస్‌లో తలదాచుకునేందుకు ప్రయత్నించాడని పేర్కొన్నారు.

"""/" / కాగా.న్యూయార్క్ లాంగ్ ఐలాండ్‌కు సమీపంలోని జెరిఖోలోని నార్త్ బ్రాడ్‌వేకు ( North Broadway In Jericho )ఉత్తర దిశలో 2019 డాడ్జ్ రామ్ సౌత్‌లో అమన్‌దీప్ తన ట్రక్కును నడుపుకుంటూ వెళ్తున్నాడు.

ఈ క్రమంలో 2019 ఆల్ఫా రోమియా వద్ద నలుగురు ప్రయాణీకులతో వెళ్తున్న ఫోర్ డోర్ సెడాన్ కారును ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో డ్రూ హాసెన్‌బీన్, ఏతాన్ ఫాల్కో విట్జ్‌ అనే ఇద్దరు టీనేజర్లు అక్కడికక్కడే మృతి చెందగా.

మిగిలిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.న్యూయార్క్‌లోని రోస్లిన్‌లో నివసిస్తున్నఅమన్‌దీప్.

ప్రమాదం జరిగిన వెంటనే భయంతో అక్కడి నుంచి పారిపోతూ మరో వాహనాన్ని ఢీకొట్టాడు.

ఈ ఘటనలో గాయపడిన 49 ఏళ్ల మహిళ, 16 ఏళ్ల బాలుడికి పోలీసులు ప్రాథమిక చికిత్స అందించి ఇంటికి పంపారు.

వీడియో: కొమోడో డ్రాగన్ పామును పట్టుకుని ఏం చేసిందో చూస్తే కళ్లు తేలేస్తారు!