అమెరికాలో దారుణం .. దుండగుడి కాల్పుల్లో భారత సంతతి తండ్రీ కూతుళ్లు మృతి
TeluguStop.com
అమెరికాలో( America ) దారుణం చోటు చేసుకుంది.దుండగుడి కాల్పుల్లో భారత సంతతికి చెందిన వ్యక్తి, అతని కుమార్తె ప్రాణాలు కోల్పోయారు.
వర్జీనియా రాష్ట్రంలో( Virginia ) జరిగిన ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
మృతులను ప్రదీప్ కుమార్ పటేల్, ( Pradeep Kumar Patel )అతని కుమార్తెగా గుర్తించారు.
వీరిద్దరూ అకోమాక్ కౌంటీలోని లాంక్ ఫోర్డ్ హైవేలోని దుకాణంలో పనిచేస్తున్నారు.ఈ అకోమాక్ కౌంటీ వర్జీనియా తూర్పు తీరంలో ఉంది.
మార్చి 20న ఉదయం 5.30 గంటలకు కాల్పుల ఘటన వెలుగు చూడగా వెంటనే డిప్యూటీలు ఘటనాస్థలికి చేరుకున్నారని అకోమాక్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది.
"""/" /
పోలీసులు అక్కడికి చేరుకునేసరికి బాధితులు తుపాకీ గాయాలతో పడిఉన్నారని అధికారులు తెలిపారు.
తొలుత ప్రదీప్ కుమార్ పటేల్, ఆ తర్వాత భవనంలో తనిఖీలు చేస్తుండగా అతని కుమార్తెలు అచేతనంగా కనిపించినట్లు వెల్లడించారు.
ప్రదీప్ కుమార్ ఘటనాస్థలిలో మరణించగా.గుర్తు తెలియని మహిళను సెంటారా నార్ఫోక్ జనరల్ ఆసుపత్రికి( Sentara Norfolk General Hospital ) తరలించగా.
అక్కడ చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు.కాల్పుల ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేసినట్లు అకోమాక్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ప్రకటించింది.
అతనిని ఫ్రేజియర్ డెవాన్ వార్టన్ ( Frazier Devon Wharton )(44)గా గుర్తించారు.
నిందితుడిని అకోమాక్ జైలుకు తరలించారు. """/" /
ఫస్ట్ డిగ్రీ హత్య, ఫస్ట్ డిగ్రీ హత్యాయత్నం, తుపాకీని కలిగి ఉండటం తదితర అభియోగాలను వార్టన్‌పై నమోదు చేశారు.
కాల్పులకు దారి తీసిన కారణాలు తెలియరాలేదు.దుకాణం యజమాని పరేష్ పటేల్.
బాధితులిద్దరూ తన కుటుంబ సభ్యులని తెలిపారు.నా కజిన్ భార్య, ఆమె తండ్రి స్టోర్‌లో పనిచేస్తుండగా.
అగంతకుడు వచ్చి కాల్పులు జరిపాడని పరేష్ పోలీసులకు తెలిపారు.సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో అమెరికాలోని భారతీయ సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
స్టార్ యాంకర్ విష్ణుప్రియకు భారీ షాక్.. ఆ బెయిల్ ఇవ్వడం అస్సలు కుదరదంటూ?