ట్రూడోకు షాకిచ్చిన జగ్మీత్ సింగ్ .. అవిశ్వాసానికి సై , దింపేస్తానంటూ పోస్ట్
TeluguStop.com
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ( Canadian Prime Minister Justin Trudeau )ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
ఇటీవల ఆ దేశ ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్ (Deputy Prime Minister Chrystia Freeland )తన పదవికి రాజీనామా చేయడంతో పాటు ట్రూడోపై తీవ్ర విమర్శలు చేశారు.
క్రిస్టియా పర్యవేక్షిస్తోన్న ఆర్ధిక శాఖను మార్చడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు.
కెనడా ప్రభుత్వ యంత్రాంగంలో ట్రూడో తర్వాత అంతటి శక్తివంతురాలిగా క్రిస్టియాకు పేరుంది.అలాంటి వ్యక్తి రాజీనామా చేయడంతో కెనడాలో రాజకీయ సంక్షోభం తలెత్తినట్లయ్యింది.
ఇప్పటికే మైనారిటీలో ఉన్న ట్రూడో ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందంటూ కెనడియన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
"""/" /
ఈ క్రమంలో ఇప్పటి వరకు ప్రభుత్వానికి సహకరించిన భారత సంతతి నేత, న్యూడెమొక్రాటిక్ పార్టీ చీఫ్ జగ్మీత్ సింగ్ ( New Democratic Party Chief Jagmeet Singh )సైతం ట్రూడోకు షాకిచ్చారు.
లిబరల్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ఆయన స్పష్టం చేశారు.ఈ మేరకు దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాసి దానిని ఎక్స్‌లో పోస్ట్ చేశారు జగ్మీత్ సింగ్.
లిబరల్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎన్‌డీపీ సిద్ధంగా ఉందని.ప్రధానిగా ట్రూడో విఫలమయ్యారని జగ్మీత్ మండిపడ్డారు.
"""/" /
ప్రజల కోసం కాకుండా.శక్తిమంతుల కోసం పనిచేస్తున్నారని, అందుకే కెనడియన్ల కోసం పనిచేసే ప్రభుత్వం ఏర్పడేందుకు కృషి చేస్తామని జగ్మీత్ సింగ్ అన్నారు.
త్వరలో జరగనున్న పార్లమెంట్ సెషన్‌లో ట్రూడో సర్కార్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతామని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంతో పాటు పలు పార్టీలు అవిశ్వాస తీర్మానానికి మద్ధతు ఇస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ట్రూడో ప్రభుత్వాన్ని కాపాడుతూ వస్తున్న జగ్మీత్ సింగ్ కూడా అవిశ్వాసానికి జై కొట్టడంతో లిబరల్ పార్టీ నేతలు షాక్ అవుతున్నారు.
దీంతో జస్టిన్ ట్రూడో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? అవిశ్వాసానికి ముందే రాజీనామా చేస్తారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
నేను రోడ్డు షో చేయలేదు.. ఈ ఘటనలో నా తప్పులేదు: అల్లు అర్జున్