అమెరికా: భార్య ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని .. ఇన్‌సైడర్ ట్రేడింగ్, భారతీయుడికి జైలు శిక్ష
TeluguStop.com
భార్యకు చెందిన ట్రేడింగ్ సమాచారాన్ని చట్టవిరుద్ధంగా ఉపయోగించి సెక్యూరిటీల మోసానికి పాల్పడి 1.
4 మిలియన్ డాలర్లను సంపాదించినందుకు భారత సంతతికి చెందిన వ్యక్తికి అమెరికా కోర్టు 26 నెలల జైలు శిక్ష విధించింది.
వివరాల్లోకి వెళితే.వాషింగ్టన్ రాష్ట్రం బోథెల్‌కు చెందిన వికీ బొహ్రా (37) 2016-18 మధ్యకాలంలో అమెజాన్ ఫైనాన్స్ విభాగంలో మాజీ ఉద్యోగి అయిన తన భార్య నుంచి అమెజాన్ ట్రేడింగ్ సమాచారాన్ని దొంగిలించాడు.
దీని సాయంతో 1.4 మిలియన్ డాలర్లను అక్రమంగా ఆర్జించాడు.
ఈ నేరంపై వికీని పోలీసులు అరెస్ట్ చేయగా.నవంబర్ 2020లో అతను తన నేరాన్ని అంగీకరించాడు.
ఈ నేరం రుజువుకావడంతో సియెటెల్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ వికీ బోహ్రాకు జూన్ 10న 26 నెలల జైలు శిక్ష విధించినట్లు అమెరికా న్యాయశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
తీర్పు సందర్భంగా యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తి జేమ్స్ ఎల్ రాబర్ట్ మాట్లాడుతూ.
బోహ్రా తనతో పాటు భార్యను, తండ్రిని నేరస్థులుగా మార్చారని వ్యాఖ్యానించారు.వైట్ కాలర్ నేరాలను ఎట్టి పరిస్ధితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఇందుకు బోహ్రా శిక్ష అనుభవించాల్సిందేనని న్యాయమూర్తి తేల్చిచెప్పారు.
"""/"/
యూఎస్ అటార్నీ టెస్సా ఎమ్ గోర్మాన్ మాట్లాడుతూ.బోహ్రా అతని భార్య టెక్ సంస్థలో ఉద్యోగాలు చేస్తూ వేల డాలర్లు వేతనంగా, బోనస్‌లుగా మరికొంత సంపాదిస్తున్నప్పటికీ అతను సంతృప్తి చెందలేదని మండిపడ్డారు.
అమెజాన్ స్టాక్‌ను ట్రేడింగ్ చేయడం ద్వారా చట్టవిరుద్ధంగా లాభాలు ఆర్జించాలని పథకం వేశారని గోర్మాన్ తెలిపారు.
ఇన్‌సైడర్ ట్రేడింగ్‌తో స్టాక్ మార్కెట్లను ఆడుకోవాలని ప్రయత్నించేవారికి ఈ కేసు ఒక హెచ్చరిక కావాలని ఆయన అన్నారు.
"""/"/
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) దర్యాప్తు చేసిన ఈ కేసులో సెప్టెంబర్ 28, 2020లో వికీ బోహ్రాపై సివిల్ ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమీషన్ (ఎస్ఈసీ) అభియోగాలు మోపింది.
నిందితుడు, అతని కుటుంబసభ్యులు జరిమానా కింద 26,52,899 డాలర్లను చెల్లించారు.అభ్యర్థన ఒప్పందం కింద బోహ్రా భార్య తమ నుంచి ఎలాంటి క్రిమినల్ కేసులను ఎదుర్కోదని అమెజాన్ స్పష్టం చేసింది.
అలాగే ఆమె ఇకపై అమెజాన్‌లో ఉద్యోగంలో కొనసాగరని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
వీడియో: పురాతన నిధికి కాపలాగా భయంకర జీవులు.. అదే ఆశ్చర్యకరం..