యూకే సార్వత్రిక ఎన్నికల బరిలో భారత సంతతి మహిళ .. ఎవరీ హజీరా పిరానీ ..?

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడ కీలక స్థానాలను అధిరోహిస్తున్న సంగతి తెలిసిందే.

యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో రాజకీయాలను సైతం మనవారు శాసిస్తున్నారు.

దీనిలో భాగంగా త్వరలో యూకేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు పలువురు ప్రవాస భారతీయులు సిద్ధమయ్యారు.

ఈస్ట్ మిడ్‌లాండ్స్‌లోని లీసెస్టర్‌షైర్‌లోని తన స్వస్ధలం నుంచి హజీరా పిరానీ ( Hazira Pirani )బరిలో నిలిచారు.

ఆమె తల్లి మహారాష్ట్రకు చెందినవారు కాగా.పూర్వీకులు గుజరాత్‌కు చెందినవారు.

దక్షిణ లీసెస్టర్‌షైర్‌లోని హార్బరో ఓడ్‌బీ అండ్ విగ్‌స్టన్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికవ్వాలనే లక్ష్యంతో ఉన్న పిరానీ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

"""/" / నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్)ను రక్షించడాన్ని ఆమె నినాదంగా తీసుకున్నారు.

76 ఏళ్ల క్రితం ఎన్‌హెచ్‌ఎస్‌ని స్థాపించిన లేబర్ పార్టీ మాత్రమే ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్‌లను పరిష్కరించగలదని పిరానీ హైలైట్ చేస్తున్నారు.

2019లో తాను సెప్సిస్ బారి నుంచి కోలుకున్నానని , తన ఊపిరితిత్తులు కుప్పకూలగా, వెంటిలేటర్‌పై ఉండాల్సి వచ్చిందని ఆమె గుర్తుచేసుకున్నారు.

యూకే సెప్సిస్ ట్రస్ట్‌కు ( UK Sepsis Trust )తాను అంబాసిడర్‌గా ప్రచారం చేస్తున్నానని, సెస్పిస్ లక్షణాలను గుర్తించడంపై దక్షిణాసియా కమ్యూనిటీలలో అవగాహన పెంచుతున్నానని హజీరా వెల్లడించారు.

లేబర్ పార్టీ తరపున బరిలో నిలిచేందుకు కూడా ఇది ఒక కారణమన్నారు.ఎన్‌హెచ్ఎస్‌ను సృష్టించిన పార్టీగా, దానిని రక్షించగలిగింది లేబర్ పార్టీయే అన్నారు.

మానవ అక్రమ రవాణా బాధితులకు మద్ధతుగా నిలిచే యూకేలోని అనేక స్వచ్ఛంద సేవా సంస్థలలో పిరానీ చురుగ్గా పాల్గొన్నారు.

"""/" / భారతీయ మూలాలతో ఎప్పుడూ కనెక్ట్ అవుతూనే ఉంటానని, భారత్‌లోని తన కుటుంబాన్ని కలుసుకోవడానికి తరచూ వెళ్తూ వుంటానని పిరానీ తెలిపారు.

తన ఫ్యామిలీ తనలో పెంపొందించిన విలువలే తనను బ్రిటీష్ ఇండియన్ పార్లమెంటరీ అభ్యర్ధిగా ఇక్కడి వరకు తీసుకొచ్చిందన్నారు.

మార్పు ప్రభావితం చేయడానికి మన వాయిస్‌ని గట్టిగా వినిపించాలని.14 ఏళ్లుగా దేశంలో గందరగోళాన్ని ఎదుర్కొంటున్నామని, లేబర్ పార్టీ మాత్రమే తిరిగి స్థిరత్వాన్ని తీసుకురాగలదని ఆమె ఆకాంక్షించారు.

అన్నట్లు.యూకేలో జూలై 4న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత… అదే నా కోరిక అంటూ?