కెనడా చరిత్రలోనే అతిపెద్ద చోరీ .. త్వరలో లొంగిపోనున్న భారత సంతతి వ్యక్తి, లాయర్‌తో వర్తమానం

కెనడా చరిత్రలోనే అతిపెద్ద చోరీ త్వరలో లొంగిపోనున్న భారత సంతతి వ్యక్తి, లాయర్‌తో వర్తమానం

కెనడా( Canada ) చరిత్రలోనే అతిపెద్ద బంగారం, నగదు దోపిడీ కేసుకు సంబంధించి 31 ఏళ్ల భారత సంతతికి చెందిన మాజీ ఎయిర్ కెనడా మేనేజర్ కొద్దివారాల్లో లొంగిపోవడానికి సిద్ధమవుతున్నాడని అతని న్యాయవాది శనివారం తెలిపారు.

కెనడా చరిత్రలోనే అతిపెద్ద చోరీ త్వరలో లొంగిపోనున్న భారత సంతతి వ్యక్తి, లాయర్‌తో వర్తమానం

గతేడాది టొరంటోలోని పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో జరిగిన ఈ దోపిడీ ఘటనలో సిమ్రాన్ ప్రీత్ పనేసర్ వాంటెడ్‌గా ఉన్నాడు.

కెనడా చరిత్రలోనే అతిపెద్ద చోరీ త్వరలో లొంగిపోనున్న భారత సంతతి వ్యక్తి, లాయర్‌తో వర్తమానం

తన క్లయింట్ కెనడియన్ న్యాయ వ్యవస్థపై చాలా నమ్మకంగా ఉన్నాడని అతని తరపు న్యాయవాది గ్రెగ్ లాఫోంటైన్ తెలిపారు.

చోరీ కేసుకు సంబంధించి భారత సంతతికి చెందినవారు సహా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దొంగతనం జరిగిన సమయంలో ఎయిర్ కెనడా ఉద్యోగిగా ఉన్న సిమ్రాన్ పనేసర్ ( Simran Panesar )హస్తం ఉన్నట్లు తేలడంతో అతని కోసం కెనడా వ్యాప్తంగా వారెంట్లు జారీ అయ్యాయి.

పనేసర్ కెనడాకు తిరిగి రావడానికి వీలుగా విదేశాలలో ఏర్పాట్లు చేసుకుంటున్నాడని లాయర్ చెప్పారు.

అయితే పనేసర్ ఎక్కడ ఉన్నాడనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. """/" / మే 6న పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

టొరంటో ఎయిర్‌పోర్టులో భారతీయ సంతతికి చెందని అర్చిత్ గ్రోవర్‌ను( Archit Grover ) పరిశోధకులు అరెస్ట్ చేసి అభియోగాలు మోపారు.

ఏప్రిల్‌లో అంటారియోకు చెందిన పర్మ్‌పాల్ సిద్ధూ (54), అమిత్ జలోటా (40), అమ్మద్ చౌదరి (43), అలీ రజా (37), ప్రసాత్ పరమలింగం (35)లను అదుపులోకి తీసుకున్నారు.

మిగిలిన నిందితుల జాడ కనుగొనేందుకు అన్ని మార్గాలను అనుసరిస్తున్నట్లు పీల్ రీజినల్ పోలీసులు తెలిపారు.

"""/" / ఏప్రిల్ 17, 2023న 22 మిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన బంగారు కడ్డీలు, విదేశీ కరెన్సీని మోసుకెళ్లే ఎయిర్‌కార్గో కంటైనర్‌లో నకిలీ పత్రాలను ఉపయోగించి సురక్షిత నిల్వ కేంద్రం నుంచి దొంగిలించబడిందని పోలీసులు తెలిపారు.

స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నుంచి టొరంటోని పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్ కెనడా విమానంలో బంగారం, కరెన్సీలు వచ్చింది.

ఫ్లైట్ ల్యాండింగ్ అయిన కాసేపటికే, కార్గోను ఆఫ్ లోడ్ చేసి ఎయిర్‌పోర్టులోని ప్రత్యేక ప్రదేశానికి తరలించారు.

కానీ ఆ మరుసటి రోజే అది కనిపించకుండా పోయిందని పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు.

ఆరోజున 6600 బార్‌ల 9999 శాతం స్వచ్ఛమైన బంగారం 400 కిలోగ్రాములు.20 మిలియన్ కెనడా డాలర్లు, 5 మిలియన్ల విదేశీ కరెన్సీని ఎయిర్‌పోర్ట్‌లోని ప్రత్యేక ప్రదేశానికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఆ స్టార్ హీరోకు ఊరమాస్ ఎలివేషన్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ భార్య.. అంత అభిమానమా?