యూకే ఛాన్సలర్‌కు సలహాదారుగా భారత సంతతి ఆర్ధిక నిపుణుడు..!!

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం పరాయి గడ్డ మీదకు వెళ్లిన భారతీయులు నేడు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తున్న సంగతి తెలిసిందే.

అక్కడి కీలక వ్యవస్థల్లో భారతీయులు మంచి హోదాల్లో పనిచేస్తున్నారు.రాజకీయ నాయకులు, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలుగా రాణిస్తున్నారు.

200 సంవత్సరాల పాటు మనల్ని పాలించిన బ్రిటన్‌లోనూ ప్రస్తుతం భారతీయుల ప్రాబల్యం పెరుగుతోంది.

మొన్నటికి మొన్న ఇంగ్లీష్ గడ్డకు ప్రధానిగా ఒక భారతీయుడు అయ్యే అవకాశం కాస్తలో మిస్ అయ్యింది.

కానీ భవిష్యత్‌లో ఈ కల సాకారమయ్యే అవకాశాలు లేకపోలేదు.ఇక అసలు విషయంలోకి వెళితే.

భారత సంతతికి చెందిన పెట్టుబడి నిపుణుడు, ఆర్ధికవేత్త సుశీల్ వాధ్వానికి యూకేలో కీలక పదవి దక్కింది.

యూకే ఛాన్సలర్ జెరెమీ తన కొత్త ఆర్ధిక సలహా మండలికి నియమించబడిన నలుగురు ఆర్ధిక నిపుణులలో సుశీల్ ఒకరు.

ఆయనతో పాటు ఎలిమెంట్ క్యాపిటల్‌కు చెందిన గెర్ట్‌జన్ వ్లీఘే, బ్లాక్‌రాక్‌కి చెందిన రూపర్ట్ హారిసన్‌, జేపీ మోర్గాన్ అసెట్ మేనేజ్‌మెంట్‌కు చెందిన కరెన్ వార్డ్‌లు ఈ సలహా మండలిలో సభ్యులుగా వున్నారు.

"""/"/ సోమవారం సాయంత్రం హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఈ కొత్త సలహా మండలి సభ్యుల నియామకం గురించి జెరెమీ హంట్ ప్రకటన చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థలపై నెలకొన్న భయాలు, అస్ధిరత, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వంటి పరిస్ధితుల నేపథ్యంలో యూకే ఆర్ధిక స్థిరత్వానికి ప్రాధాన్యం ఇవ్వడం అత్యంత ముఖ్యమని హంట్ అన్నారు.

క్వాసీ క్వార్టెంగ్‌ను తప్పించి.జెరెమీ హంట్‌ను కొత్త ఆర్ధిక మంత్రిగా నియమించారు బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్.

క్వాసీ ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలైన సంగతి తెలిసిందే.

ఈ కారణం చేతే క్వాసీని తప్పించారు లిజ్ ట్రస్.ఇకపోతే.

ఇన్వెస్ట్‌మెంట్స్ విభాగంలో మూడు దశాబ్ధాల అనుభవం వున్న వాధ్వాని గతంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ స్వతంత్ర ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ)లో మాజీ సభ్యుడు.

ప్రస్తుతం పీజీఐఎం వాధ్వాని అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థకు ఆయన చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌గా సారథ్యం వహిస్తున్నారు.

క్రిష్4 సినిమాకు అసలు సమస్య ఇదేనా.. దర్శకుడి షాకింగ్ కామెంట్స్ వైరల్!