నాసా- నోకియా డీల్‌: చంద్రుడిపై 4జీ సేవలు.. ఇండో అమెరికన్ నిపుణుడి కనుసన్నల్లోనే అంతా..!!

ఇకపై చందమామ పైనా మొబైల్‌ ఫోన్‌ వాడొచ్చు.అది కూడా 4జీ, 5జీ స్పీడ్‌తో.

నమ్మడానికి ఆశ్చర్యంగా వుంది కదూ.అయినా ఇదే నిజం.

భూమి మీద మాదిరిగా చంద్రుడిపై ఏకంగా మొబైల్ నెట్ వర్క్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

దీనికి సంబంధించి 2020 అక్టోబర్‌లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)తో ప్రముఖ మొబైల్‌ దిగ్గజం నోకియా ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ప్రాజెక్ట్‌ కోసం 14.1 మిలియన్ డాలర్ల నిధులను వెచ్చించనుంది నాసా.

ఇది సాకారమైతే.జాబిల్లిపై తొలి 4జీ/ఎల్నె‌టీఈ నెట్‌వర్స్‌ను నిర్మించిన సంస్థగా నోకియా చరిత్ర సృష్టించనుంది.

అంతేకాదు.ఆ తర్వాత దాన్ని 4జీ నుంచి 5జీకి అప్‌గ్రేడ్ చేయనుంది.

ఇంతటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌కు నేతృత్వం వహించేది మన భారత సంతతికి చెందిన వ్యక్తి కావడం భారతీయులందరికీ గర్వకారణం.

నోకియాలో చీఫ్ స్ట్రాటజీ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీఎస్‌టీవో)గా పనిచేస్తున్న నిషాంత్ బాత్రా .

చంద్రుడిపై మొట్టమొదటి సెల్యూలర్ నెట్‌‌వర్క్ ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహించనున్నారు.2021 జనవరిలో నోకియాలో సీఎస్‌టీవోగా చేరిన నిషాంత్.

తర్వాత నోకియా గ్రూప్ లీడర్‌షిప్ టీమ్‌లో సభ్యుని స్థాయికి ఎదిగారు. """/"/ INSEAD నుంచి ఎంబీఏ.

డల్లాస్‌లోని సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీ నుంచి టెలికమ్యూనికేషన్స్‌, కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ.

భారత్‌లోని దేవి అహల్య యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో నిషాంత్ బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నారు.

నోకియాలో చేరడానికి ముందు బాత్రా.స్వీడన్‌కు చెందిన వియోనిర్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పనిచేశారు.

అంతేకాదు ఎరిక్సన్‌లో 12 ఏళ్ల పాటు పలు హోదాల్లోనూ విధులు నిర్వర్తించారు.ఫిన్‌లాండ్‌లోని ఎస్పూలో స్థిరపడిన నిషాంత్ బాత్రా.

ఆసియా, యూరప్, యూఎస్‌లలో నివసించారు.నోకియాలో చేరిన తర్వాత టెక్నాలజీ ఆర్కిటెక్చర్‌ మేనేజ్‌మెంట్, నోకియా బెల్ ల్యాబ్స్‌లో జరిగిన పలు పరిశోధనల్లో ఆయన కీలకపాత్ర పోషించారు.

ఇండస్ట్రీలో అనాథను అయిపోయాను.. వైరల్ అవుతున్న కృష్ణవంశీ ఎమోషనల్ కామెంట్స్!