Vivek Taneja : అమెరికా : రోడ్డుపై ఘర్షణ .. దుండగుడి దాడిలో భారత సంతతి కంపెనీ ఎగ్జిక్యూటివ్ మృతి

అమెరికాలో భారతీయులపై ( Indians In America )దాడులు , వారి మరణాలు కొనసాగుతూనే వున్నాయి.

ఇప్పటికే ఐదుగురు భారతీయ విద్యార్ధులు వేర్వేరు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

తాజాగా వాషింగ్టన్ డౌన్‌టౌన్‌లోని రెస్టారెంట్ వెలుపల జరిగిన ఘర్షణలో గాయాలపాలైన భారత సంతతికి చెందిన వివేక్ తనేజా( Vivek Taneja ) అనే ఎగ్జిక్యూటివ్ మృతిచెందాడు.

దర్యాప్తు అధికారులు చెబుతున్న దాని ప్రకారం.ఫిబ్రవరి 2న తెల్లవారుజామున 2 గంటల సమయంలో దాడిపై సమాచారం అందుకున్న అధికారులు షాటో రెస్టారెంట్ వెలుపల 15వ స్ట్రీట్ నార్త్‌వెస్ట్‌లోని 1100 బ్లాక్‌కు చేరుకున్నారు.

అక్కడ తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో పడివున్న వివేక్ తనేజాను గుర్తించి.హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

"""/" / ప్రాథమిక దర్యాప్తులో తనేజా , మరో గుర్తు తెలియని వ్యక్తికి మధ్య ఘర్షణ జరిగిందని సీబీఎస్‌తో( CBS ) అనుబంధంగా వున్న వాషింగ్టన్ డీసీలోని ఓ టెలివిజన్ పేర్కొంది.

అతను తనేజాను నేలపై పడేసి తలను పేవ్‌మెంట్‌కేసి కొట్టాడు.తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనేజా బుధవారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు.

దీంతో పోలీసులు తనేజా మృతిని హత్య కేసుగా పరిగణిస్తున్నారు.తనేజా డైనమో టెక్నాలజీస్ కో ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్‌‌గా విధులు నిర్వర్తిస్తున్నారు .

కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం.వ్యూహాత్మక , వృద్ధి, భాగస్వామ్య కార్యక్రమాలకు డైనమో సేవలందిస్తుంది.

ప్రధానంగా ఫెడరల్ ప్రభుత్వ కాంట్రాక్ట్ రంగానికి ప్రాధాన్యతనిస్తుంది. """/" / తనేజా మరణానికి కారణమైన వ్యక్తి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

సీసీటీవీ ఫుటేజ్‌‌లో అతని జాడ గుర్తించినట్లుగా తెలుస్తోంది.మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్( Metropolitan Police Department ) (ఎంపీడీ) ఫిబ్రవరి 2న 15వ స్ట్రీట్‌లోని 1100 బ్లాక్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని గుర్తించేందుకు పౌర సమాజాన్ని సాయం కోరింది.

నిందితుడి ఆచూకీపై సమాచారం అందించిన వారికి ఎంపీడీ రివార్డ్‌ను సైతం ప్రకటించింది.ఇప్పటికే ఈ వారం ప్రారంభంలో చికాగోలో సయ్యద్ మజాహిర్ అలీ ( Syed Mazahir Ali )అనే భారతీయ విద్యార్ధిపై దోపిడి దొంగలు దాడి చేశారు.

అంతకుముందు శ్రేయస్ రెడ్డి బెనిగర్, నీల్ ఆచార్య, వివేక్ సైనీలు దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు.

వరుస ఘటనల నేపథ్యంలో అమెరికాలో భారతీయ విద్యార్ధులు బిక్కుబిక్కుమంటున్నారు.