ఆసియన్‌ను కొట్టి ట్రాక్‌పై పడేసిన అమెరికన్లు: దూసుకొచ్చిన రైలు... భారతీయుడి చాకచక్యం

ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.దేశాధ్యక్షుడి నుంచి తోటి అమెరికన్ల వరకు హిత బోధ చేస్తున్న అగ్రరాజ్యంలోని కొందరు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు.

దీంతో ఆసియా అమెరికన్లపై దాడులు ఏమాత్రం ఆగడం లేదు.వీరిని టార్గెట్‌గా చేసుకుని విద్వేష దాడులకు పాల్పడుతున్న వారి సంఖ్య నానాటీకి పెరుగుతోంది.

భౌతికదాడులతో పాటు హత్యలకు సైతం ఉన్మాదులు వెనుకాడటం లేదు.మార్చి నెలలో అట్లాంటాలోని మూడు మసాజ్ పార్లర్లను లక్ష్యంగా చేసుకుని ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 8 మంది మహిళలు మరణించారు.

అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లు సహా పలువురు ప్రముఖులు ఆసియన్లపై ద్వేషాన్ని విడనాడాలని పిలుపునిచ్చినా కొందరు మారడం లేదు.

"""/"/ తాజాగా న్యూయార్క్‌లో జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.అయితే ఇప్పటి వరకు జరిగిన అన్ని ఘటనల్లోకి ఇది భిన్నం.

ఆసియన్‌ను చావకొట్టిన కొందరు అమెరికన్లు.అతనిని రైల్వే ట్రాక్‌పై పడేసి వెళ్లిపోయారు.

తీవ్ర గాయాలతో ఎటూ కదల్లేకపోయిన అతను నరకయాతన అనుభవించాడు.ఆ సమయంలోనే రైలు వేగంగా దూసుకొస్తోంది.

అతను కూడా తన ప్రాణాల మీద ఆశలు వదిలేసుకున్నాడు.కానీ ఆ ట్రైన్‌ను నడుపుతున్న భారతీయుడు జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి అత్యంత చాకచక్యంగా వ్యవహరించి అతని ప్రాణాలు కాపాడాడు.

"""/"/ తొబిన్ మొదాతిల్‌(29) అనే భార‌త సంత‌తి వ్య‌క్తి ఆ రైలు నడుపుతున్నాడు.

స‌బ్‌వే ఆప‌రేట‌ర్ సూచ‌న మేర‌కు వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన తొబిన్ ట్రాక్‌పై ఉన్న వ్య‌క్తి పరిస్థితిని చూసి 30 అడుగుల దూరంలోనే రైలును నిలిపివేయ‌డంతో బాధితుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

ఈ ప్రక్రియలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా.తొబిన్ గమనించకపోయినా ఆ వ్యక్తి తునాతునకలయ్యేవాడు.

రైలు ఆగిన వెంటనే స్థానికులు గాయాల‌తో ఉన్న వ్య‌క్తిని చికిత్స కోసం దగ్గరలోని మౌంట్ సినాయ్ మెడికల్ సెంట‌ర్‌కు త‌ర‌లించారు.

ప్ర‌స్తుతం బాధితుడు ఆస్ప‌త్రిలో కోలుకుంటున్న‌ట్లు స‌మాచారం.మరోవైపు సమయస్పూర్తిగా వ్య‌వ‌హ‌రించి ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన తొబిన్‌పై అమెరికన్ మీడియా ప్ర‌శంస‌ల వర్షం కురిపిస్తోంది.

వేలానికి హిట్లర్ సన్నిహిత మిత్రుడి విల్లా.. దాని విశేషాలు ఇవే..?