ర్యాష్ డ్రైవింగ్‌కు ఇద్దరు పసివాళ్లు బలి .. భారతీయ డ్రైవర్‌కు 25 ఏళ్ల జైలు
TeluguStop.com
అమెరికాలో( America ) ఇద్దరు యువకుల మరణానికి కారణమైన ఘటనలో భారత సంతతికి చెందిన వ్యక్తికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లుగా అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
మద్యం, కొకైన్‌ను పరిమితికి మించి తీసుకున్న ఆ వ్యక్తి 150 కిలోమీటర్లకు పైగా వేగంతో వాహనం నడపడంతో ఈ ప్రమాదం జరిగింది.
2023లో న్యూయార్క్‌లోని( New York ) లాంగ్ ఐలాండ్‌లో ఈ రాంగ్ వే క్రాష్ జరిగింది.
మే 3, 2023న నసావు కౌంటీలో మద్యం తాగి వాహనం నడిపి 14 ఏళ్ల ఈతాన్ ఫాల్కోవిడ్జ్, డ్రూ హాసెన్‌బీన్ మరణానికి కారణమైన భారత సంతతికి చెందిన అమన్‌దీప్ సింగ్‌కు( Amandeep Singh ) శుక్రవారం ఎనిమిదిన్నర నుంచి 25 ఏళ్ల జైలు శిక్ష విధించబడిందని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.
శుక్రవారం తుది తీర్పు సందర్భంగా మినోలాలోని కోర్టు గదిలోకి ప్రవేశించినప్పుడు అమన్‌దీప్ మౌనంగా కనిపించాడు.
నిందితుడికి న్యాయస్థానం శిక్ష విధించిన నేపథ్యంలో మృతులకు చెందిన వందలాది మంది మిత్రులు, సన్నిహితులతో నసావు కౌంటీ కోర్ట్( Nassau County Court ) హాల్ నిండిపోయింది.
"""/" /
ఘటన జరిగిన రోజున జెరిఖోలోని నార్త్ బ్రాడ్‌వేకు ఉత్తర దిశలో 2019 డాడ్జ్ రామ్ సౌత్‌లో తన ట్రక్కును( Truck ) నడుపుకుంటూ వెళ్తున్నాడు.
ఈ క్రమంలో 2019 ఆల్ఫా రోమియా వద్ద నలుగురు ప్రయాణీకులతో వెళ్తున్న ఫోర్ డోర్ సెడాన్ కారును ఢీకొట్టినట్లు నసావు కౌంటీ పోలీసులు గురువారం తెలిపారు.
"""/" /
ఈ ప్రమాదంలో డ్రూ హాసెన్‌బీన్,( Drew Hassenbein ) ఏతాన్ ఫాల్కో విట్జ్( Ethan Falkowitz ) అక్కడికక్కడే మృతి చెందగా.
మిగిలిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వీరిని పోలీసులు వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు ఫాక్స్ న్యూస్ నివేదించింది.
న్యూయార్క్‌లోని రోస్లిన్‌లో నివసిస్తున్న అమన్‌దీప్.ప్రమాదం జరిగిన వెంటనే భయంతో అక్కడి నుంచి పారిపోతూ మరో వాహనాన్ని ఢీకొట్టాడు.
ఈ ఘటనలో గాయపడిన 49 ఏళ్ల మహిళ, 16 ఏళ్ల బాలుడికి పోలీసులు ప్రాథమిక చికిత్స అందించి ఇంటికి పంపారు.
Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters