జార్జియా సెనేట్ ఎన్నికల బరిలో భారత సంతతి యువకుడు.. ట్రంప్ మిత్రుడితోనే సై !

వృత్తి, ఉద్యోగ , వ్యాపారాల కోసం అమెరికా గడ్డపై అడుగుపెట్టిన భారతీయులు కీలక స్థానాలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా రాజకీయాల్లో ప్రవాస భారతీయులు రాణిస్తున్నారు.ఇప్పటికే మేయర్లు, సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులుగా అమెరికన్ రాజకీయాలను శాసిస్తున్నారు.

నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత మూలాలున్న కమలా హారిస్( Kamala Harris ) డెమొక్రాటిక్ పార్టీ తరపున బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.

ముందస్తు అంచనాలు, ఓపీనియన్ పోల్స్‌లో ఆమె ముందంజలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. """/" / ఇదిలాఉండగా.

భారత సంతతికి చెందిన డెమొక్రాటిక్ పార్టీ యువనేత అశ్విన్ రామస్వామి( Ashwin Ramaswami ) నవంబర్ 5 ఎన్నికల్లో జార్జియాలోని( Georgia ) సెనేట్ డిస్ట్రిక్ట్ 48 సీటు నుంచి బరిలో నిలిచారు.

అంతేకాదు.ఎన్నికల్లో పోటీ చేయనున్న అతి పిన్న వయస్కుడైన అభ్యర్ధిగానూ రామస్వామి రికార్డుల్లోకెక్కారు.

జార్జియా సెనేట్ .రిపబ్లికన్లకు తొలి నుంచి కంచుకోటగా ఉంది.

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు( Donald Trump ) అత్యంత సన్నిహితుడైన షాన్ స్టిల్‌‌తో( Shawn Still ) రామస్వామి తలపడుతున్నారు.

"""/" / అశ్విన్ రామస్వామి ఈ ఏడాదితో 25వ యేట అడుగుపెట్టి ఎన్నికల్లో పోటీ చేయడానికి కావాల్సిన కనీస వయసును అందుకున్నారు.

అశ్విన్ తమిళనాడుకు చెందిన భారతీయ వలసదారులకు జన్మించగా జాన్స్ క్రీక్‌లో పెరిగారు.రామస్వామి ఎన్నికల ప్రచార పోర్టల్‌ ప్రకారం అశ్విన్ .

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అభ్యసించారు.జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో లా పట్టాను అందుకున్నారు.

సైబర్ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తుండగా 2020లో నకిలీ ఓటర్ల కేసు తెరపైకి రావడంతో అశ్విన్ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు.

జార్జియాలో షాన్ స్టిల్ మరో ఇద్దరు ట్రంప్ సన్నిహితులు మాజీ అధ్యక్షుడికి నకిలీ ఓట్లను వేయించారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి.

సైబర్ సెక్యూరిటీలో అశ్విన్ రామస్వామికి బలమైన నేపథ్యం ఉంది.డెమొక్రాట్ సైబర్ సైక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ (సీఐఎస్ఏ)తో కలిసి పనిచేశాడు.

ఈ సమయంలో స్థానిక ఎన్నికలు సైబర్ ఎటాక్‌లకు గురికాకుండా పర్యవేక్షించాడు.

అందమైన ఆటోలో అదిరిపోయే టెక్నాలజీ.. అక్కడ డాష్‌క్యామ్ పెట్టడంతో..?