ఆస్ట్రేలియా : సెనేటర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన భారత సంతతి నేత దేవ్ శర్మ

ఆస్ట్రేలియా : సెనేటర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన భారత సంతతి నేత దేవ్ శర్మ

భారత సంతతికి చెందిన మాజీ ఎంపీ డేవ్ శర్మ( Dave Sharma ) ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో న్యూసౌత్ వేల్స్ (ఎన్ఎస్‌డబ్ల్యూ) సెనేటర్‌గా( New South Wales Senator ) సోమవారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఆస్ట్రేలియా : సెనేటర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన భారత సంతతి నేత దేవ్ శర్మ

47 ఏళ్ల శర్మ .గత నెలలో రాష్ట్ర మాజీ కోశాధికారి ఆండ్రూ కాన్‌స్టాన్స్‌ను ఓడించి ఎన్ఎస్‌డబ్ల్యూ సెనేట్ స్థానాన్ని గెలుచుకున్నారు.

ఆస్ట్రేలియా : సెనేటర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన భారత సంతతి నేత దేవ్ శర్మ

తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత సంతతి నేతగా దేవ్ శర్మ చరిత్ర సృష్టించారు.

ఇజ్రాయెల్‌లో ఆస్ట్రేలియా రాయబారిగా పనిచేసిన దేవ్ శర్మను తాజా విజయంతో ఇండో ఆస్ట్రేలియన్ కమ్యూనిటీ, అతని సహచరులు అభినందించినట్లు ది కాన్‌బెర్రా టైమ్స్ నివేదించింది.

మాజీ విదేశాంగ మంత్రి మారిస్ పేన్‌చే ఖాళీ చేసిన సీటులో ఆయన ప్రమాణం చేస్తున్నప్పుడు ఎన్ఎస్‌డబ్ల్యూలోని మితవాద వర్గం సహచరులు ఆండ్రూ బ్రాగ్, కోవాసిక్‌లు శర్మ వెంటే వున్నారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మా కొత్త సెనేటర్ దేవ్ శర్మను తీసుకెళ్లడాన్ని గౌరవంగా భావిస్తున్నానని సెనేటర్ కోవాసిక్( Kovacic ) తన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

ఫెడరల్ లిబరల్ టీమ్‌లోకి శర్మకు స్వాగతం అంటూ లిబరల్ పార్టీ డిప్యూటీ లీడర్ సుస్సాన్ లే( Sussan Ley ) అన్నారు.

పార్లమెంటేరియన్‌గా, సీనియర్ దౌత్యవేత్తగా శర్మకు అపార అనుభవం వుందని లే ప్రశంసించారు.రెండవ ప్రపంచ యుద్ధం నుంచి ఆస్ట్రేలియా( Australia ) అత్యంత ప్రమాదకరమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ఉన్నందున దేవ్ విదేశాంగ విధానం, తెలివితేటలు ఉపయోగపడతాయని లే తన ఎక్స్‌లో రాశారు.

"""/" / అంతకుముందు లిబరల్ పార్టీ నేత పీటర్ డట్టన్( Peter Dutton ) మాట్లాడుతూ.

శర్మ సెనేట్‌లోకి ప్రవేశించడం కీలకమైన పరిణామంగా పేర్కొన్నారు.అతని దౌత్య, విదేశాంగ విధాన నైపుణ్యం, అనుభవం.

తూర్పు యూరప్, మధ్యప్రాచ్యం, ఇండో పసిఫిక్‌లోని అనిశ్చిత పరిస్ధితులను దృష్టిలో వుంచుకుని ప్రజా విధాన చర్చకు విలువను, వివేకాన్ని ఇస్తుందని డట్టన్ ఆకాంక్షించారు.

ఆస్ట్రేలియన్ కార్మికులు, కుటుంబాలు, చిన్న వ్యాపారుల కోసం దేవ్ శర్మ పోరాడుతూనే వుంటారని డట్టన్ గుర్తుచేశారు.

"""/" / పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావడానికి ముందు దౌత్యవేత్తగా కెరీర్ ప్రారంభించిన దేవ్ శర్మ.

వాషింగ్టన్ డీసీలోనూ పనిచేశారు.పోర్ట్ మోర్స్బీ, బౌగెన్‌విల్లేలోని పీస్ మానిటరింగ్ గ్రూప్‌లో శాంతి పరిరక్షకుడిగానూ విధులు నిర్వర్తించారు.

ప్రధాని , కేబినెట్ విభాగంలో అంతర్జాతీయ విభాగానికి నాయకత్వం వహించారు.కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్న దేవ్ శర్మ న్యాయ శాస్త్రంలో ఫస్ట్ క్లాస్ ఆనర్స్‌తో పట్టభద్రుడయ్యాడు.

కేంబ్రిడ్జ్ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, డీకిన్ వర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఇంటర్నేషనల్ రిలేషన్స్) పట్టా పొందారు.

ఇక జుట్టు రాలే సమస్యతో బాధపడొద్దు.. ఇలా చెక్ పెట్టండి!