యూకే - భారత్ నౌకాదళ విన్యాసాలు: బ్రిటీష్ నేవీలో సత్తా చాటుతున్న భారత సంతతి సెయిలర్

హిందూ మహాసముద్రంలో భారత్- బ్రిటన్ దేశాల నౌకాదళాల సంయుక్త విన్యాసాలు మరికొన్ని రోజుల్లో జరగనున్నాయి.

ఈ విన్యాసాల్లో బ్రిటీష్ రాయల్ నేవీలో పనిచేస్తున్న భారత సంతతికి చెందిన జగ్జీత్ సింగ్ గ్రెవాల్ భాగమయ్యారు.

యూకే నేవీలోని అతిపెద్ద విమాన వాహకనౌక హెచ్ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ (సీఎస్‌జీ)లో ఆయన క్రూ మెంబర్‌గా వున్నారు.

ఇతని కుటుంబసభ్యులు దశాబ్ధాలుగా బ్రిటీష్, భారత్‌లోని సాయుధ దళాల్లో పలు హోదాల్లో సేవలందించారు.

ఐదవ తరం విమాన వాహక నౌకలో మెరైన్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న గ్రెవాల్ విమానయాన ఇంధనం అత్యున్నత ప్రమాణాల వద్ద పనిచేసేలా బాధ్యత వహించడంతో పాటు ఫ్లైట్ డెక్‌లో ఇంధనాన్ని నింపే విధి కూడా ఆయనదే.

తద్వారా ఎఫ్ 35 బి జెట్‌, మెర్లిన్ హెలికాఫ్టర్లు, ఇతర విమానాలు ఎలాంటి ఆటంకం లేకుండా పనిచేయడానికి తోడ్పడతారు.

యూకేలో స్థిరపడిన గ్రెవాల్‌ కుటుంబానికి ఇండియన్ ఆర్మీలో సుదీర్ఘ చరిత్ర వుంది.ఆయన తాతయ్య రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్ సైన్యంలో పనిచేశారని గ్రెవాల్ తెలిపారు.

డిస్పాచెస్, బర్మా స్టార్, ఆఫ్రికా స్టార్, వార్ మెడల్, డిఫెన్స్ మెడల్‌ను ఆందుకున్నారని ఆయన వెల్లడించారు.

తన తండ్రి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేశారని, తన భార్య సోదరుడు, మామయ్య ప్రస్తుతం ఇండియన్ నేవీలో విధులు నిర్వహిస్తున్నారని గ్రెవాల్ పేర్కొన్నారు.

తన పనిని అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించడంపైనే ఎల్లప్పుడూ తాను దృష్టి పెడతానని ఆయన చెప్పాడు.

కానీ ఇండియన్ ఆర్మీతో కలిసి పనిచేసేటప్పుడు తన కుటుంబ బంధాలను కొనసాగిస్తున్న విషయాన్ని గుర్తుంచుకుంటానని వెల్లడించారు.

"""/"/ కాగా, క్వీన్ ఎలిజబెత్ నేతృత్వంలోని యూకే సీఎస్జీ సూయజ్ కాలువ మీదుగా హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించి భారతీయ నౌకాదళంతో కలిసి సంయుక్త విన్యాసాలలో పాల్గొంటుందని బ్రిటీష్ హైకమీషన్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఐదవ తరం విమాన వాహక నౌక అయిన క్వీన్ ఎలిజబెత్‌ను బ్రిటన్ రంగంలోకి దింపడం ద్వారా భారత్‌తో పాటు ఇండో పసిఫిక్ మిత్రదేశాలతో రక్షణ సహకారం విషయంలో కొత్త శకానికి నాంది పలికినట్లయ్యింది.

తెలంగాణలో ఏం మార్పు వచ్చింది..: సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి ప్రశ్నలు