యూకే : కోవెంట్రీ సిటీ లార్డ్ మేయర్‌గా భారత సంతతి వ్యక్తి.. ఎవరీ జస్వంత్ సింగ్ బిర్డి..?
TeluguStop.com
ఇంగ్లాండ్ వెస్ట్ మిడ్‌లాండ్స్‌లోని( West Midlands Of England ) కోవెంట్రీ నగరానికి లార్డ్ మేయర్‌గా భారత సంతతి వ్యక్తి నియమితులయ్యారు.
భారత్‌లోని పంజాబ్‌లో జన్మించిన జస్వంత్ సింగ్ బిర్డి( Jaswant Singh Birdi ).
సిటీ కౌన్సిల్ ఛైర్మన్‌గా వుంటారు.కోవెంట్రీ ప్రథమ పౌరుడిగా ఆయన రాజకీయేతర అధిపతిగా వ్యవహరిస్తారు.
అయితే సాధారణ మేయర్ మాదిరిగా జస్వంత్ సింగ్‌కు అసాధారణ అధికారాలు వుండవు.ఈ క్రమంలో తన నియామకంపై స్పందించారు జస్వంత్ సింగ్.
ఈ నగరం తనకు , తన కుటుంబానికి ఎంతో ఇచ్చిందని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
గత వారం జరిగిన కోవెంట్రీ కేథడ్రల్ వార్షిక సమావేశంలో ( Cathedral Annual Meeting )మేయర్ అధికారిక రెగాలియాగా ధరించే ఛైన్స్ ఆఫ్ ఆఫీస్‌ను జస్వంత్ సింగ్‌కు అందించారు.
సిక్కు మతాన్ని అవలంభించే వ్యక్తిగా తాను తలపాగా ధరించే వుంటానని ఆయన స్పష్టం చేశారు.
తద్వారా నగరంలో బహుళ సంస్కృతికి నిదర్శనంగా.ఇతరులకు కూడా స్పూర్తినిస్తుందని జస్వంత్ సింగ్( Jaswant Singh ) అన్నారు.
పంజాబ్‌లో జన్మించిన జస్వంత్.ఆయన కుటుంబం ఉపాధి కోసం పలు ప్రాంతాలకు వలస వెళ్లినందున లాహోర్, పశ్చిమ బెంగాల్‌లలో గడిపారు.
1950లలో జస్వంత్ సింగ్ తన తల్లిదండ్రులతో కలిసి తూర్పు ఆఫ్రికాలోని కెన్యాకు వలస వచ్చారు.
అక్కడే ప్రాథమిక, ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన ఉన్నత చదువుల కోసం 60వ దశకంలో యూకేకు వెళ్లారు.
"""/" /
1990లలో హిల్‌ఫీల్డ్స్ వార్డ్‌లో కౌన్సిలర్‌గా పనిచేశారు.గత తొమ్మిదేళ్లుగా బాబ్లేక్ వార్డ్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ మొత్తంగా 17 ఏళ్లు కౌన్సిలర్‌గా సేవలందించారు.
12 నెలల నుంచి డిప్యూటీ లార్డ్ మేయర్‌గా పనిచేస్తున్న జస్వంత్.కెవిన్ మాటన్ ( Kevin Matton )స్థానంలో లార్డ్ మేయర్‌గా నియమితులయ్యారు.
కౌన్సిలర్‌గానే కాకుండా.నగరంలో మత, సామాజిక, కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లలో జస్వంత్ చురుగ్గా పాల్గొన్నారు.
మస్కులర్ డిస్ట్రోఫీ ఛారిటీ, కోవెంట్రీ రిసోర్స్ సెంటర్ ఫర్ ది బ్లైండ్ , యూనివర్సిటీ హాస్పిటల్స్ కోవెంట్రీ, వార్విక్‌షైర్ ఛారిటీ సంస్థల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
"""/" /
ఇకపోతే.పంజాబ్ రాష్ట్రం చండీగఢ్‌లో జన్మించిన చారు సూద్ గతేడాది జూన్‌లో ఎల్ బ్రిడ్జ్ నగరానికి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన సంగతి తెలిసిందే.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎల్ బ్రిడ్జ్ బరో కౌన్సిల్‌లో వరుసగా రెండోసారి ఆమె కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.
2018లో ఇదే స్థానం నుంచి తొలిసారిగా ఎన్నికైన చారు సూద్ మంచి పనితీరు కనబరిచారు.
ఎల్ బ్రిడ్జ్‌లోని కన్జర్వేటివ్ పార్టీ స్టార్ క్యాండిడేట్స్‌లో ఆమె కూడా ఒకరు.అంతేకాదు తిరిగి వారి స్థానాలను నిలబెట్టుకోగలిగిన కొద్దిమందిలో చారు సూద్ వున్నారు.
వైరల్ ఫొటోస్.. ఏంటి భయ్యా టీమిండియా స్టార్స్ అందరూ ఇలా సన్యాసం తీసుకున్నారు