నాపై కాల్పులు జరిగాయి.. భారత సంతతి సీఈవో సంచలన పోస్ట్
TeluguStop.com
ఆదివారం తెల్లవారుజామున (Early Sunday Morning)అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో(San Francisco) తనపై రెండు సార్లు కాల్పులు జరిగాయంటూ భారత సంతతికి చెందిన సీఈవో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం దుమారం రేపుతోంది.
బాధితుడిని దీప్తాన్షు దీప్ ప్రసాద్‌గా (Deeptanshu As Deep Prasad)గుర్తించారు.అగంతకులు తనను లక్ష్యంగా చేసుకున్నారని.
అయితే కాల్పుల నుంచి తాను బయటపడ్డానిన ప్రసాద్ తెలిపారు.గుర్తు తెలియని దుండగులు తనను హోటల్ వరకు వెంబడించి మరోసారి తుపాకీతో తనపై కాల్పులు జరిపారని వెల్లడించారు.
కెనడాలోని టొరంటోలో నివసిస్తున్న ప్రసాద్.బీచ్ నుంచి హోటల్‌కు తిరిగి వెళ్తుండగా ఈ దాడి జరిగిందని చెప్పారు.
హోటల్ సిబ్బందిలోని ఒకరికి తుపాకీ స్పష్టంగా కనిపించినప్పటికీ.శాన్‌ఫ్రాన్సిస్కో పోలీస్ డిపార్ట్‌మెంట్ మాత్రం దీనిని బాణాసంచా పేలుళ్లుగా చెబుతోందని ప్రసాద్ ఫైర్ అయ్యాడు.
మొదటిసారి కాల్పులు జరిగిన తర్వాత దుండగులు తనను హోటల్ వరకు వెంబడించారని.తాను భయంతో లోపలికి వెళ్లి సిబ్బందిని పిలవడంతో వారు నాపై మళ్లీ కాల్పులు జరిపారని ప్రసాద్ తెలిపారు.
సిబ్బందిలో ఒకరు తుపాకీని చూశారని.ఈ ఘటనతో నాకు ఇంకా కాళ్లు, చేతులు వణికిపోతున్నాయని ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సంఘటనపై దర్యాప్తు చేయనందుకు శాన్‌ఫ్రాన్సిస్కో పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను ప్రసాద్ విమర్శిస్తున్నారు.ఇలాంటి కేసులను ఇంత నిర్ధయగా వ్యవహరించడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.
"""/" /
శాన్‌ఫ్రాన్సిస్కో ప్రమాదకరమైన నగరంగా అభివర్ణించిన ప్రసాద్.30 ఏళ్లలో తనకు ఇలాంటి పరిస్ధితి ఎప్పుడూ ఎదురుకాలేదన్నారు.
అయితే తర్వాతి పోస్టులలో దుండగులు తనపై బాణాసంచా కూడా విసిరి ఉండొచ్చని ప్రసాద్ అంగీకరించారు.
ఈ ఘటనపై మరింత లోతైన దర్యాప్తు చేయడానికి శాన్‌ఫ్రాన్సిస్కో పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా సీసీటీవీ ఫుటేజ్ కోసం హోటల్‌ను అభ్యర్ధించిందని ప్రసాద్ చెప్పారు.
కానీ ప్రస్తుతానికి నన్ను నేను, హోటల్ సిబ్బందిని విశ్వసిస్తానని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ వ్యవహారం అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది.
బాహుబలి సమయానికి నా వయస్సు అంతే.. బాహుబలి నటి షాకింగ్ కామెంట్స్ వైరల్!