బ్రిటన్ ప్రభుత్వ రంగ సంస్థ సారథిగా భారత సంతతి పారిశ్రామిక దిగ్గజం

విద్యా, ఉద్యోగ, వ్యాపారాల కోసం దేశ విదేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడ అన్ని రంగాల్లోనూ రాణిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక రాజకీయాల్లోనూ కీలక పదవులు పొందుతూ ఆయా దేశాలను శాసించే స్థాయిలో వున్నారు.

తాజాగా బ్రిటన్‌ ప్రభుత్వంలోని కీలక ఏజెన్సీకి భారత సంతతి పారిశ్రామిక వేత్త విండి బంగా చైర్‌గా నియమితులయ్యారు.

యూకే గవర్నమెంట్ ఇన్వెస్టిమెంట్స్ ఏజెన్సీ (యూకేజీఐ)గా పిలిచే ఈ సంస్థ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ నియంత్రణలో పనిచేస్తుంది.

కార్పోరేట్ ఫైనాన్స్, గవర్నన్స్‌లో నిపుణులైన వారు ఇందులో విధులు నిర్వర్తిస్తారు.66 ఏళ్ల బంగా పూర్తి పేరు మన్వీందర్ విండి సింగ్ బంగా.

1954 అక్టోబర్ 31న సిమ్లాలోని ఒక సిక్కు కుటుంబంలో ఆయన జన్మించారు.ఆయన తండ్రి భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్‌.

బంగా ఢిల్లీ ఐఐటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్, ఐఐఎంలో బిజినెస్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు.

ప్రస్తుతం మేరీ క్యూరీలో చైర్‌గా వ్యవహరిస్తున్నారు.అలాగే గ్లాక్సో‌స్మిత్‌క్లైన్‌లో సీనియర్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఎన్ఈడీ)గా విధులు నిర్వర్తిస్తున్నారు.

సెప్టెంబర్ నుంచి బంగా యూకేజీఐ చైర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని ట్రెజరీ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

వీటితో పాటు విండి బంగా ‘‘ ది ఎకనమిస్ట్ గ్రూప్‌’’కు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గాను, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ క్లేటన్, డుబ్లియర్ అండ్ రైస్ (సీడీ అండ్ ఆర్)లో పార్ట్‌నర్‌గా వున్నారు.

ఈ సంస్థలో ఆయన చివరికి గ్లోబల్ ఫుడ్స్, హోమ్, పర్సనల్ కేర్ బిజినెస్‌కు ప్రెసిడెంట్‌గా పనిచేశారు.

అంతేకాకుండా యూనిలివర్ ఎగ్జిక్యూటివ్ బోర్డులోనూ విధులు నిర్వర్తించారు. """/"/ కమీషనర్ ఫర్ పబ్లిక్ అపాయింట్‌మెంట్స్ (ఓసీపీఏ) ద్వారా యూకేజీఐ చైర్ అపాయింట్‌మెంట్ నియంత్రించబడుతుంది.

అలాగే యూకే కేబినెట్ ఆఫీస్ ప్రచురించిన ప్రచురించిన పబ్లిక్ అపాయింట్‌మెంట్‌లపై గవర్నెన్స్ కోడ్ ప్రకారం నియామకం జరుగుతుంది.

చైర్ నియామకం మెరిట్ ఆధారంగా జరుగుతుందని ట్రెజరీ శాఖ తెలిపింది.ఇక యూకేజీఐ విధుల విషయానికి వస్తే.

పెట్టుబడులపై ప్రభుత్వానికి సలహాలను అందించడంతో పాటు పరిష్కారాలను సూచిస్తుంది.కార్పోరేట్ నిర్మాణాలు, ఫైనాన్స్ చర్చలు వంటి ఆర్ధిక అంశాలను విశ్లేషిస్తుంది.

దీనితో పాటు ప్రభుత్వ కార్పోరేట్ ఆస్తులను విక్రయించడం, నిర్వహించడం, అమలు చేయడం వంటి బాధ్యతలు చూస్తుంది.

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఇల్లు చూశారా.. ఇంత సింపుల్ గా ఉండటం డార్లింగ్ కే సాధ్యమా?