ఇండో కెనడియన్ బిల్డర్ దారుణ హత్య .. భారతీయ గ్యాంగ్‌స్టర్ల హస్తంపై అనుమానాలు..?

కెనడాలోని ఎడ్మాంటన్( Edmonton, Canada ) నగరంలో భారత సంతతికి చెందిన బిల్డర్‌ను కాల్చిచంపిన ఘటన ఇరు దేశాల్లో కలకలం రేపుతోంది.

పంజాబీ మూలాలున్న బూటా సింగ్ గిల్( Boota Singh Gill ) నగరంలో ప్రముఖ వ్యక్తిగా, గురునానక్ సిక్కు దేవాలయం అధిపతిగానూ వున్నారు.

బూటాసింగ్ హత్య వెనుక భారతీయ గ్యాంగ్‌స్టర్‌ల హస్తం వుందని పోలీసులు అనుమానిస్తున్నారు.ఆయన గిల్ బిల్డ్ హోమ్స్ లిమిటెడ్ యజమాని.

కెనడాకు చెందిన వర్గాల సమాచారం ప్రకారం భారతీయ గ్యాంగ్‌స్టర్‌లు దేశంలోని ఖలిస్తాన్ అనుకూల వర్గాలతో చేతులు కలిపారు.

ఈ క్రమంలోనే భారత సంతతికి చెందిన ధనికులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారు.గతేడాది జూన్ 18న ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను( Hardeep Singh Nijjar ) బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో హతమార్చడంతో ఖలిస్తాన్ అనుకూల గ్రూపుల బెదిరింపులు ఎక్కువయ్యాయి.

నిజ్జర్ హత్య జరిగిన 10 నెలల తర్వాత బూటా సింగ్‌ను కాల్చిచంపారు.ఆయన మరణానికి కారణమైనట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిక్ ధలివాల్ కూడా ఘటనాస్థలిలోనే మరణించాడు.

మరో వ్యక్తి సివిల్ ఇంజనీర్ అయిన సర్బాజిత్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

"""/" / సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోలీసులు గాయపడిన ముగ్గురు వ్యక్తులను గుర్తించారు.

ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ స్పందించి తక్షణం ఘటనాస్థలికి చేరుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.భారత్‌లోని క్రిమినల్ నెట్‌వర్క్.

భారతీయ సంతతికి చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడుతోందని ఎడ్మాంటన్ పోలీసులు గతంలోనే హెచ్చరించారు.

ఎక్కువగా బిల్డర్లు, సంపన్నులు వారి లిస్ట్‌లో వున్నారని చెప్పారు. """/" / ఈ ఏడాది జనవరిలో పోలీసులు ఐదు దోపిడీలు , 15 దహనాలు, ఏడు తుపాకీ నేరాలతో సహా 27 ఘటనలను దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇవి భారత్‌లో కుట్ర చేయబడి.స్థానికంగా వుండే గ్యాంగ్‌లతో అమలు చేసిన నేరాలుగా పోలీసులు భావిస్తున్నారు.

వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్‌ల ద్వారా 1,00,000 కెనడా డాలర్ల నుంచి మిలియన్ల వరకు గ్యాంగులు డిమాండ్ చేస్తున్నాయని చెప్పారు.

ప్రశాంత్ వర్మ ఖాతాలో మరో ప్లాప్ సినిమా…కారణం ఏంటి..?