వ్యాక్సిన్ , కబాబ్ ఒకే చోట.. యూకేలో భారత సంతతి సోదరుల వినూత్న ప్రయోగం

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి బీభత్సం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే.తగ్గినట్లే తగ్గే.

కొత్త కొత్త వేరియంట్ల రూపంలో విరుచుకుపడుతూ.మానవాళిని ముప్పు ముంగిట నిలబెడుతోంది.

దక్షిణాఫ్రికాలో పుట్టిన కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా ప్రస్తుతం కల్లోల పరిస్ధితులు నెలకొన్నాయి.

ముఖ్యంగా యూరప్ ఖండం వణికిపోతోంది.రోజుకు లక్షలాది కేసులు వెలుగుచూస్తుండటం ప్రభుత్వాలు తలపట్టుకుంటున్నాయి.

అటు మనదేశంలోనూ జనవరి ప్రారంభం నుంచి రోజువారీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.ఈ క్రమంలో వ్యాక్సినేషన్ ఒక్కటే కోవిడ్‌పై పోరాడేందుకు ఆయుధమని నిపుణులు చెబుతున్నారు.

దీంతో వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేయడంతో పాటు 15 నుంచి 18 ఏళ్ల వయసున్న వారికి టీకాలు వేస్తున్నారు.

అలాగే ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు, 60 ఏళ్లు దాటిన వారికి అనేక దేశాల్లో బూస్టర్ డోస్ అందజేస్తున్నారు.

కానీ ఇంకా కొందరు మాత్రం వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు.అనవసరమైన అపోహలు, భయాలు, అనుమానాలతో టీకాలకు దూరంగా వుంటున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నాయి.మరికొన్ని చోట్ల ప్రైవేట్ సంస్థలు తమ కస్టమర్లకు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

అదే కోవలో ఇంగ్లాండ్‌లో స్థిరపడిన భారత సంతతి ఫార్మాసిస్ట్ సోదరులు వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించేందుకు వినూత్న ప్రయోగం చేపట్టారు.

తమ రెస్టారెంట్ ద్వారా వీకెండ్‌లో ‘Jabs With Kebabs' అనే ఆఫర్‌ను ప్రవేశపెట్టారు.

ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని ప్రముఖ రెస్టారెంట్ పంజాబీ గ్రిల్ యజమానులైన రావ్, రాజ్ చోప్రాలు .

గతేడాది తమ తండ్రి కోవిడ్ బారినపడటంతో తమ రెస్టారెంట్‌ దగ్గరలోనే వాక్ ఇన్ వ్యాక్సిన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

ఇక్కడ కబాబ్ తినడంతో పాటు వ్యాక్సిన్ వేయించుకోని వారు టీకాలు తీసుకోవచ్చని తెలిపారు.

జాతీయ ఆరోగ్య సేవ (ఎన్‌హెచ్ఎస్) వ్యాక్సిన్ ప్రోగ్రామ్‌లో సోదరులిద్దరూ వాలంటీర్లుగా సేవలందిస్తున్నారు. """/" / ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.

గతేడాది తమ తండ్రి కోవిడ్ బారినపడటంతో ఫార్మసీల నిర్వహణను తాత్కాలికంగా పక్కనబెట్టి, ఎన్‌హెచ్ఎస్ కార్యక్రమాలకు అండగా నిలబడాలని కోరారని తెలిపారు.

ఆయన కోరిక మేరకు తాము టీకా వేసుకున్న వారికి కబాబ్ మసాలా అందిస్తున్నట్లు చోప్రా బ్రదర్స్ వెల్లడించారు.

రావ్, రాజ్ చోప్రాల పంజాబీ గ్రిల్ దేశవ్యాప్తంగా వందలాది స్టోర్స్‌తో నడుస్తోందని.ఆ ఔట్‌లెట్లలో వైద్య సలహాలను, వ్యాక్సిన్‌ను అందించేందుకు నిపుణులు అందుబాటులో వుంటారని ఎన్‌హెచ్ఎస్ పేర్కొంది.

ఇప్పటి వరకు రెండు డోస్‌లు, బూస్టర్ డోసు తీసుకోని వారు దయచేసి ముందుకు రావాలని ఎన్‌హెచ్‌ఎస్ కోవిడ్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్‌ కోసం భారత సంతతికి చెందిన డిప్యూటీ లీడ్ డాక్టర్ నిక్కీ కనాని కోరారు.

ఇప్పటి వరకు ఇంగ్లాండ్ వ్యాప్తంగా 114 మిలియన్ల డోసులను పంపిణీ చేసినట్లు ఎన్‌హెచ్ఎస్ పేర్కొంది.

లివర్‌‌పూల్, షెఫీల్డ్, స్విండన్, సోలిహల్, కేంబ్రిడ్జ్‌షైర్‌లలో వ్యాక్సిన్ సెంటర్‌ల వద్దకు వెళ్లేందుకు ఫ్రీ ట్యాక్సీ సర్వీస్ అందుబాటులో వుంటుందని ఎన్‌హెచ్ఎస్ పేర్కొంది.

వావ్, వాట్ ఏ జీనియస్ జాకెట్.. జపనీయులు మామూలోళ్లు కాదు..