దుండగుడి దాడిలో చావు అంచుల దాకా .. హత్యాయత్నంపై పుస్తకంలో వివరించిన సల్మాన్ రష్డీ

దుండగుడి చేతిలో హత్యాయత్నానికి గురై, చావు అంచులదాకా వెళ్లొచ్చిన భారత సంతతికి చెందిన ప్రఖ్యాత రచయిత సల్మాన్ రష్డీ( Salman Rushdie ) బయటి ప్రపంచం ముందుకు వస్తున్నారు.

నాటి ఘటనలో కుడి కన్నును కోల్పోయినా, శరీరం సహకరించుకున్నా రచనను తాను కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.

తనపై జరిగిన హత్యాయత్నాన్ని తన తాజా పుస్తకం ‘Knife: Meditations After An Attempted Murder’లో వివరించారు.

కాగా.సల్మాన్ రష్డీ 1988లో రచించిన ‘‘ ది సాటానిక్ వెర్సెస్’’( The Satanic Verses ) కోట్లాది మంది ముస్లింలను , ఇస్లాంను, మొహ్మద్ ప్రవక్తను కించపరిచేలా వుందని ఆయనపై ముస్లిం దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

కానీ ఈ విషయాన్ని ఇరాన్( Iran ) మాత్రం సీరియస్‌గా పరిగణించింది.నాటి ఆ దేశ అధినాయకుడు అయతోల్లా రుహోల్లా ఖొమేనీ .

సల్మాన్ ‌ను హతమార్చాల్సిందిగా ఫత్వా జారీ చేశారు.దీంతో సల్మాన్ రష్డీ కొన్నేళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

దశాబ్ధాలు గడవటంతో, సల్మాన్ ప్రాణాలకు ముప్పు ముగిసిపోయిందని.ఫత్వా కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని భావిస్తోన్న తరుణంలో రష్డీపై గతేడాది జరిగిన దాడి యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.

"""/" / ఆగస్ట్ 2022లో అమెరికాలోని ఓ వేదికపై వున్న సల్మాన్ రష్డీపై అగంతకుడు హదీ మాటర్( Hadi Matar ) 12 సార్లు కత్తితో పొడిచాడు.

ఈ ఘటనలో సల్మాన్ తన కుడి కన్నును కోల్పోయారు.దాడి చేసిన వ్యక్తితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ ఖండించగా.

సల్మాన్ రష్డీ వైఖరే ఈ ఘటనకు కారణమని పేర్కొంది.24 ఏళ్ల నిందితుడు కూడా తాను హత్యాయత్నానికి పాల్పడలేదని వ్యాఖ్యానించాడు.

దాడి చేసిన నిందితుడు లెబనాన్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన వ్యక్తి.అతను న్యూయార్క్ పోస్ట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.

తాను ది సాటానిక్ వెర్సెస్ పుస్తకంలోని రెండు పేజీలను మాత్రమే చదివానని చెప్పాడు.

"""/" / అతను (నిందితుడు) తనను గట్టిగా కొట్టాడని తొలుత భావించానని అతని చేతిలో కత్తి వుందని గ్రహించలేదని సల్మాన్ పేర్కొన్నారు.

ఆపై రక్తాన్ని చూశానని.అక్కడ ఆయుధం వుందని గ్రహించానని ఆయన చెప్పారు.

నా మెడపై పెద్ద కోత, నా మొండెం మధ్యలో రెండు వైపులా కత్తిపోట్లు , నా కంటిలో గాయం జరిగిందని సల్మాన్ అన్నారు.

దాడి కారణంగా తన కనుగ్రుడ్డు బయటకి వచ్చి ముఖంపై వేలాదిందని సల్మాన్ గుర్తుచేసుకున్నారు.

27 సెకన్ల పాటు జరిగిన దాడిలో 12 సార్లు అతను కత్తితో పొడిచాడని ఆయన తెలిపారు.

మహేష్ రాజమౌళి మూవీలో యాక్ట్ చేయడానికి భయం.. సలార్ నటుడు కామెంట్స్ వైరల్!