అమెరికా : దుండగుడి దాడిలో చావు అంచుల దాకా.. నెలల తర్వాత మళ్లీ వేదికపైకి సల్మాన్ రష్డీ

దుండగుడి చేతిలో హత్యాయత్నానికి గురై, చావు అంచులదాకా వెళ్లొచ్చిన భారత సంతతికి చెందిన ప్రఖ్యాత రచయిత సల్మాన్ రష్డీ( Salman Rushdie ) చాలా రోజుల తర్వాత బయటి ప్రపంచం ముందుకు వచ్చారు.

తాను ఒకప్పుడు అధ్యక్షుడిగా పనిచేసిన సాహిత్య సంస్థ అయిన ‘‘PEN America Gala’’ కార్యక్రమానికి గురువారం హాజరయ్యారు.

ఈ సందర్భంగా సల్మాన్ రష్డీ మాట్లాడుతూ.PEN Americaతో తనకు సుదీర్ఘ బంధం వుందన్నారు.

చాలా రోజుల తర్వాత రచయితలు, బుక్ పబ్లిషర్స్ మధ్య గడుపుతున్నందుకు తనకు చాలా ఆనందంగా వుందని రష్డీ పేర్కొన్నారు.

కాగా.సల్మాన్ రష్డీ 1988లో రచించిన ‘‘ ది సాటానిక్ వెర్సెస్’’( The Satanic Verses ) కోట్లాది మంది ముస్లింలను , ఇస్లాంను, మొహ్మద్ ప్రవక్తను కించపరిచేలా వుందని ఆయనపై ముస్లిం దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

కానీ ఈ విషయాన్ని ఇరాన్ ( Iran ) మాత్రం సీరియస్‌గా పరిగణించింది.

నాటి ఆ దేశ అధినాయకుడు అయతోల్లా రుహోల్లా ఖొమేనీ .సల్మాన్ ‌ను హతమార్చాల్సిందిగా ఫత్వా జారీ చేశారు.

దీంతో సల్మాన్ రష్డీ కొన్నేళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.దశాబ్ధాలు గడవటంతో, సల్మాన్ ప్రాణాలకు ముప్పు ముగిసిపోయిందని.

ఫత్వా కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని భావిస్తోన్న తరుణంలో రష్డీపై గతేడాది జరిగిన దాడి యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.

"""/" / గతేడాది ఆగస్ట్‌లో పశ్చిమ న్యూయార్క్ శివార్లలోని చౌటౌకా ఇన్‌స్టిట్యూషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రష్డీ ప్రసంగిస్తుండగా.

ఓ వ్యక్తి ఆయనపై కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు.ఈ ఘటనలో రష్డీ మెడతో పాటు పది నుంచి పదిహేను చోట్ల కత్తిగాయాలయ్యాయి.

దీంతో రష్డీ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.ప్రథమ చికిత్స అనంతరం రష్డీని హెలికాఫ్టర్‌లో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

పలు సర్జరీల అనంతరం వైద్యులు ఎంతో శ్రమించి ఆయన ప్రాణాలు నిలబెట్టారు. """/" / ఆసుపత్రిలో కోలుకున్న అనంతరం తన కొత్త నవల ‘‘విక్టరీ సిటీ’’ ప్రచురణ సందర్భంగా సల్మాన్ రష్డీ ఫిబ్రవరిలో ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ నవలను తనపై దాడికి నెల ముందు పూర్తి చేశారు.247 సంవత్సరాలు జీవించే ఒక కథానాయకుడి కథే ఈ విక్టరీ అని రష్డీ తెలిపారు.

ఇప్పటికే దీనికి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.సోషల్ మీడియాలో నెలల తరబడి మౌనంగా వున్న రష్డీ ఇప్పుడు సందర్భానుసారంగా ట్వీట్లు చేస్తున్నారు.

అలాగే నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సైతం సమాధానాలు ఇస్తున్నారు.కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నానని.

కానీ చాలా కష్టంగా వుందని సల్మాన్ రష్డీ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.

వైరల్.. బయటపడ్డ ఇన్వేస్టిగేషన్ అధికారి రాసలీలలు.. ఏకంగా 400ల వీడియోలు లీక్