నాసా మూన్ ప్రాజెక్ట్‌లో భారత సంతతి వ్యోమగామి.. ఎవరీ అనిల్ మీనన్..?

అంతరిక్ష యానంలో భారత సంతతి శాస్త్రవేత్తలు, వ్యోమగాములు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే.

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)తో పాటు స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజన్, వర్జిన్ గెలాక్టిక్ వంటి అనేక స్పేస్ ఏజెన్సీల్లో భారతీయులు కీలక హోదాల్లో వున్నారు.

తాజాగా నాసాలో మరో ఇండో అమెరికన్ వ్యోమగామి స్థానం సంపాదించాడు.అమెరికా వాయుసేనలో లెఫ్ట్‌నెంట్‌గా, స్పేస్ ఎక్స్‌‌లో తొలి ఫ్లైట్ సర్జన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ మీనన్.

నాసా చంద్రుడి మీదకు పంపనున్న 10 మంది సభ్యుల వ్యోమగాముల బృందంలో చోటు దక్కించుకున్నారు.

మిన్నెసోటాలోని మిన్నియాపొలిస్‌లో పుట్టిపెరిగిన అనిల్ మీనన్ .ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ తొలిసారిగా మనిషిని అంతరిక్షంలో పంపేందుకు నిర్వహించిన ‘‘డెమో 2’’ మిషన్ సమయంలో సాయం చేశారు.

భవిష్యత్ మిషన్‌లను దృష్టిలో వుంచుకుని ఒక వైద్య సంస్థను అనిల్ నెలకొల్పారు.ఆయన పొలియో టీకాపై అధ్యయనం చేయడానికి , రోటరీ అంబాసిడోరియల్ స్కాలర్‌గా భారత్‌లో ఏడాది పాటు గడిపారు.

అంతేకాకుండా వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) తీసుకెళ్లే వివిధ యాత్రల కోసం నాసా క్రూ ఫ్లైట్ సర్జన్‌గా కూడా అనిల్ పనిచేశారు.

"""/" / మీనన్‌కు ఎమర్జెన్సీ మెడిసిన్ ఫిజీషియన్‌గా గుర్తింపు వుంది.2010లో హైతీలో, 2015లో నేపాల్‌లో సంభవించిన భూకంపాల్లోనూ.

2011 రెనో ఎయిర్‌షో ప్రమాదంలోనూ తొలిగా స్పందించింది ఆయనే.ఇక ఎయిర్‌ఫోర్స్ విషయానికి వస్తే.

అనిల్ మీనన్ 45వ స్పేస్ వింగ్‌కు ఫ్లైట్ సర్జన్‌గా, 173వ ఫైటర్ వింగ్‌కు సపోర్ట్‌గా వుంటున్నారు.

ఎఫ్ 15 ఫైటర్ జెట్‌లో 100 సోర్టీలకు పైగా ఆయన లాగిన్ అయ్యారు.

క్రిటికల్ కేర్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ టీమ్‌లో వున్నప్పుడు 100 మంది రోగులను తరలించిన ట్రాక్ రికార్డ్ అనిల్‌కు వుంది.

ఇకపోతే నాసా మూన్ ప్రాజెక్ట్‌కు సంబంధించి 2020 మార్చిలో దరఖాస్తు చేసుకున్న 12 వేలకు పైగా మందిలో ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలని ఎంపిక చేశారు.

వారు శిక్షణ పొందిన పూర్తి వ్యోమగాములుగా మారడానికి ముందు, మారిన తర్వాత అంతరిక్ష ప్రయాణం వుండే అవకాశం వుంటుంది.

ఈ వ్యోమగాములంతా ఆర్టెమిస్ జనరేషన్ కిందకు వస్తారు.

వైసీపీదే అధికారమని చెబుతున్న మరో సర్వే.. ఈ ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేదా?