కరోనా మహమ్మారి అమెరికాపై ఇప్పటికీ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతూనే ఉంది.కరోనా కారణంగా అమెరికాలో దాదాపు లక్ష్లలాది మంది మృత్యువాత పడగా , బాధితులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు.
ఇప్పటి వరకూ కరోనా సోకిన రోగుల సంఖ్య లెక్కకి మించే ఉంటుంది.ఎంతో మంది అమెరికన్స్ తో పాటుగా భారతీయ ఎన్నారైలు కూడా మృత్యు వాత పడుతున్నారు.
గడించిన నెలలో భారత సంతతికి చెందిన ఎంతో మంది నైపుణ్యం కలిగిన వైద్యులు కరోనా కారణంగానే మృతి చెందినట్టుగా తెలుస్తోంది.
రోజుకో చోట ఎన్నారైల మృతి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.తాజాగా అమెరికాలో మరో భారతీయ ఎన్నారై కరోనా కారణంగా మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.
అమెరికాలో 10 ఏళ్ళ క్రితమే స్థిరపడిన అతడు గుజరాత్ లోని వాస్నా గ్రామానికి చెందిన ఈ ఎన్నారై అమెరికాలోనే స్థిరపడ్డాడు.
కరోనా తీవ్ర రూపం దాల్చిన సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉన్న కరోనా సోకడంతో అతడి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందని నిన్నటి రోజున అతడు కరోనాతో పోరాడి మృతి చెందాడని తెలుస్తోంది.
ఇదిలాఉంటే అమెరికాలోని చారోతా ప్రాంతంలో ఎన్నారైలు అధిక సంఖ్యలో ఉంటారాని తెలుస్తోంది.చనిపోయిన ఎన్నారై కూడా అదే ప్రాంతానికి చెందిన వాడని ఈ ప్రాంతంలో ఇప్పటికే ఎంతో మంది ఎన్నారైలు కరోనా కారణంగా మృతి చెందారని స్థానికులు అంటున్నారు.
ఇదిలాఉంటే ఇప్పటి వరకూ అమెరికా వ్యాప్తంగా సుమారు 21 లక్షల కేసులు నమోదు కాగా 1.
17 లక్షల మంది మృత్యు వాత పడ్డారు.
జీలకర్ర వర్సెస్ సోంపు.. వెయిట్ లాస్‌లో ఏది ఎఫెక్టివ్ గా పని చేస్తుందో తెలుసా..?