ఆదాయమే లేదు పన్ను ఎలా కట్టాలి మోడీజీ?

మన దేశంలో 130 కోట్ల మంది ఉంటే వారిలో కేవలం కోటిన్నర మంది మాత్రమే పన్ను కడుతున్నారని మిగిలిన వారు పన్ను చెల్లించకుండా తమ ఆదాయాన్ని దాచుకుంటున్నారంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వ్యవహరించి పన్ను చెల్లించాలని, లేదంటే దేశం ఇతర దేశాలతో పోల్చితే వెనుకబడి పోతుందని మోడీ అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే.

2022వ సంవత్సరంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోబోతున్నాం.అప్పటి వరకు పన్ను కట్టే వారి సంఖ్య భారీగా పెరగాలంటూ ఆయన కోరాడు.

మోడీ వ్యాఖ్యలపై సామాన్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఆదాయం లేకున్నా పన్ను కట్టేది ఎలా, ఇండియాలో ఇంకా వంద కోట్ల మంది మద్యతరగదికి దిగువనే ఉన్నారు.

వారంతా కూడా ట్యాక్స్‌ కట్టడం అంటే సాధ్యం అయ్యే విషయం కాదు.మీరు చాలా మంది వద్ద బ్లాక్‌ మనీ ఉంది.

బాగా డబ్బున్న వారు ఎంతో మంది పన్ను చెల్లించకుండా తిరుగుతున్నారు.వారి గురించి ఆలోచించండి.

సామాన్యుల నుండి పన్ను ఎలా వసూళ్లు చేయాలనే విషయాన్ని మర్చి పోండి అంటూ మోడీపై కౌంటర్‌ వేస్తున్నారు.

శబరి మూవీ రివ్యూ: మదర్ సెంటిమెంట్ మాములుగా లేదుగా!