దొడ్డిదారిన అమెరికాలోకి ప్రవేశిస్తూ.. పోలీసులకు చిక్కి, ఇమ్మిగ్రేషన్ కస్టడీలో భారతీయుడు మృతి

అక్రమ మార్గాల్లో అమెరికా( America )లో అడుగుపెట్టాలని భావించేవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే అక్కడి బోర్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అధికారులకు( Immigration Officials ) చిక్కి జైల్లో మగ్గుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు.

అలాగే సాహసాలు చేసి ప్రాణాలు పొగొట్టుకునేవారు ఇటీవలి కాలంలో పెరుగుతున్నారు.రెండేళ్ల క్రితం అమెరికా- కెనడా సరిహద్దుల్లో నలుగురు భారతీయులు అతి శీతల వాతావరణ పరిస్ధితులను తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఈ ఘటన డాలర్ డ్రీమ్స్‌( Dollar Dreams )పై మన వారికి వున్న వ్యామోహాన్ని తెలియజేస్తోంది.

ఎలాగైనా అమెరికా చేరుకోవాలనుకున్న వారి ఆశల్ని మృత్యువు ఆవిరి చేసింది.ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నా.

మనదేశంలోని యువత అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్లే ప్రయత్నాలను మాత్రం మానడం లేదు.

"""/"/ తాజాగా యూఎస్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తూ పోలీసులకు చిక్కిన 57 ఏళ్ల భారతీయుడు జస్పాల్ సింగ్( Jaspal Singh ) యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) కస్టడీలో ప్రాణాలు కోల్పోయాడు.

జస్పాల్‌ను భారత్‌కు బహిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో అతను మరణించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

జస్పాల్ సింగ్ మరణానికి ఖచ్చితమైన కారణం తెలియాలంటే పోస్ట్‌మార్టం నివేదిక వచ్చే వరకు ఆగాల్సి వుంది.

బాధితుడు సెయింట్ లూయిస్‌లోని సౌత్ ఈస్ట్ జార్జియా హెల్త్ సిస్టమ్ క్యామ్‌డెన్ క్యాంపస్‌లో కన్నుమూసినట్లు ఏప్రిల్ 15న ఫెడరల్ అధికారులు వెల్లడించారు.

న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జస్పాల్ సింగ్ కుటుంబసభ్యులకు అతని మరణవార్తను ఐసీఈ ద్వారా తెలియజేసింది.

"""/"/ 1992లో అమెరికాకు చట్టబద్ధంగా వలసవెళ్లిన జస్పాల్ సింగ్.కొన్నేళ్లుగా తన ఇమ్మిగ్రేషన్ స్థితి( Immigration Process )పై న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నాడు.

1998 జనవరిలో ఒక ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి .జస్పాల్ సింగ్‌ను అమెరికా నుంచి బహిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

అయితే ఒక రోజున సింగ్ స్వయంగా భారతదేశానికి వెళ్లినట్లుగా ఐసీఈ తెలిపింది.2023లో యూఎస్ - మెక్సికో బోర్డర్ ద్వారా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి యత్నిస్తూ యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్( US Customs And Border Protection ) అధికారులకు చిక్కాడు.

ఈ క్రమంలో జస్పాల్ సింగ్‌ను ఫోక్స్‌టన్‌లోని ఐసీఈ ప్రాసెసింగ్ సెంటర్‌లో నిర్బంధించారు.అక్కడ ఆయన ఇమ్మిగ్రేషన్ ప్రొసీడింగ్‌లను కొనసాగిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.

జస్పాల్ మృతి నేపథ్యంలో ఐసీఈ తన అదుపులో వున్న వారికి తగిన వైద్య సంరక్షణ అందిస్తున్నట్లు తెలిపింది.

నిర్బంధంలో వున్న అమెరికా పౌరుడు కానీ వ్యక్తి మరణిస్తే ఈఆర్వో రెండు రోజుల్లోగా కాంగ్రెస్, ఎన్‌జీవోలు, మీడియాకు అధికారికంగా నోటిఫికేషన్‌లను జారీ చేస్తుంది.

ఈ హిట్ సినిమాల్లో ఈ సెలబ్రిటీస్ కూడా నటించారా.. కనిపించలేదే..?