ట్రక్కుతో వైట్‌హౌస్‌లో విధ్వంసానికి కుట్ర .. తెలుగు యువకుడికి జైలు శిక్ష

ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌( White House ) మీదకి ట్రక్కుతో వెళ్లి కలకలం రేపిన భారతీయుడు, తెలుగువాడైన సాయి వర్షిత్ కందులకి (20)( Sai Varshith Kandula ) అక్కడి కోర్ట్ 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన అమెరికా ప్రభుత్వాన్ని కూలదోయడమే అతని ఉద్దేశ్యమని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్( US Department Of Justice ) ఆరోపించింది.

అతని వల్ల నేషనల్ పార్క్ సర్వీస్‌కు భారీ నష్టం వాటిల్లిందని న్యాయశాఖ తెలిపింది.

ఇతను హైదరాబాద్‌లోని చందా నగర్ ప్రాంతానికి చెందిన వాడిగా తెలుస్తోంది.సాయివర్షిత్‌కు యూఎస్ గ్రీన్ కార్డ్ కూడా ఉంది.

"""/" / కోర్టు పత్రాల ప్రకారం .సాయివర్షిత్ మే 22 , 2023 మధ్యాహ్నం సెయింట్ లూయిస్ నుంచి వాషింగ్టన్ డీసీకి వన్ వే ఫ్లైట్ టికెట్‌తో చేరుకున్నాడు.

ఆ రోజు సాయంత్రం 5.20 గంటలకు డల్లెస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని .

సాయంత్రం 6.30 గంటలకు ఓ ట్రక్కును( Truck ) అద్దెకు తీసుకున్నాడు.

భోజనం చేసి గ్యాస్ ఎక్కించుకుని రాజధాని వాషింగ్టన్‌( Washington ) వైపుకి వేగంగా ట్రక్కును నడిపించాడు.

అనంతరం అక్కడి హెచ్ స్ట్రీట్, నార్త్ వెస్ట్ , 16వ స్ట్రీట్, నార్త్‌వెస్ట్ జంక్షన్ వద్ద రాత్రి 9.

35 గంటలకు వైట్‌హౌస్ , ప్రెసిడెంట్స్ పార్క్‌కు రక్షణగా ఉంచిన బారికేడ్స్‌ను ఢీకొన్నాడు.

ఆపై సాయి వర్షిత్ వేగంగా ఫుట్‌పాత్‌పైకి ట్రక్కును నడుపుకుంటూ వెళ్లడంతో పాదచారులు ప్రాణభయంతో పరుగులు తీశారు.

"""/" / అనంతరం రివర్స్‌లో రెండవసారి మెటల్ బారికేడ్స్‌ను ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లాడు సాయివర్షిత్.

అయితే ఇంజిన్ నుంచి ఆయిల్ లీక్ , విపరీతమైన పొగ రావడంతో ట్రక్కును నిలిపివేశాడు.

తర్వాత వెంట తెచ్చుకున్న బ్యాగ్‌లో నుంచి నాజీల స్వస్తికతో వున్న జెండాను తీసి ట్రక్కుకి కట్టాడు.

ఈ ఊహించని పరిణామంతో తొలుత షాకైన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.యూఎస్ పార్క్ పోలీసులు, యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు ఘటనా స్థలంలోనే సాయివర్షిత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఇతని చర్యల కారణంగా నేషనల్ పార్క్ సర్వీస్‌కు 4,322 డాలర్లు .యూ హాల్ ఇంటర్నేషనల్‌కు 50 వేల డాలర్లు నష్టం వాటిల్లింది.

ఈ ఘటనతో వైట్‌హౌస్‌ పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

బాలయ్యకు పద్మభూషణ్…. మరోసారి ఎన్టీఆర్ ను అవమానించిన నందమూరి కుటుంబం?