పీకలదాకా తాగి.. సహోద్యోగి చేతి వేలిని కొరికేశాడు : సింగపూర్‌లో భారత సంతతి యువకుడికి జైలు
TeluguStop.com
సింగపూర్‌లో ఇటీవలికాలంలో వరుసగా భారత సంతతికి చెందిన వారు వివిధ నేరాల్లో కటకటాల పాలవుతున్నారు.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, కరోనా నిబంధనల ఉల్లంఘన తదితర నేరాల కింద అరెస్ట్ అయి చిక్కుల్లోపడుతున్నారు.
ఇప్పటికే డ్రగ్స్ కేసుల్లో పలువురికి మరణశిక్ష కూడా పడిన సంగతి తెలిసిందే.తాజాగా పీకలదాకా తాగి గొడవ పడటమే కాకుండా తన సహోద్యోగి చిటికెన వేలిని కొరికి గాయం చేసిన నేరానికి గాను 31 ఏళ్ల భారత సంతతి యువకుడికి సింగపూర్ కోర్టు 10 నెలల జైలుశిక్ష విధించింది.
లోగన్ గోవిందరాజ్ అనే వ్యక్తి భారత సంతతికే చెందిన తన సహోద్యోగి ముత్తు సెల్వం (42) ఎడమ చేతి చిటికెన వేలిని కొరికాడు.
ఈ వేలి భాగాన్ని దర్యాప్తు అధికారులు ఘటనాస్థలంలోనే కనుగొన్నారు.అయితే వైద్యుడి వద్దకు తీసుకెళ్లినా ఆ వేలిని తిరిగి అతికించలేకపోయారని ది స్ట్రైయిట్స్ టైమ్స్ నివేదించింది.
2020 డిసెంబర్ 6 సాయంత్రం 4.30 గంటలకు సింగపూర్ పశ్చిమ తీరంలోని క్రాంజి క్రాసెంట్‌లోని ఒక పారిశ్రామిక ఎస్టేట్ వద్ద లారీలో కూర్చొని గోవిందరాజ్ , సెల్వం మరో కార్మికుడితో కలిసి మద్యం సేవించారు.
గోవిందరాజ్ మూడు బీర్లు తాగినట్లు ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు.మద్యం మత్తులో సెల్వంను గోవిందరాజ్ తిట్టాడు.
వసతి గృహంలో ఇతర కార్మికులతో కలిసి నిద్రిస్తున్నాడంటూ అసభ్య పదజాలంతో దూషించాడు.అనంతరం లారీ దిగిన తర్వాత గోవిందరాజు కేకలు వేస్తూ సెల్వంను పక్కకుతోస్తూ గొడవపడ్డాడు.
ఆ సమయంలోనే సెల్వం చిటికెన వేలిని గోవిందరాజు కొరికేశాడు.అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో సెల్వం కోపంతో ఊగిపోతూ గోవిందరాజ్ తలపై కొట్టాడు.
ఈ గొడవలో తన చిటికెన వేలి కొన భాగం పడిపోయిందని గ్రహించిన సెల్వం.
దానిని అనుచరులతో వెతికించి ఆసుపత్రిలో చేరాడు.ఈ కేసులో ప్రస్తుతానికి పది నెలల జైలు శిక్షతో సరిపెట్టిన కోర్టు.
నేరం రుజువైన పక్షంలో గోవిందరాజుకి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం వుంది.
హీరో విశాల్ కి ఏమైంది… ఫుల్ క్లారిటీ ఇచ్చిన నటి కుష్బూ!