కెనడాలో ముగిసిన కాన్సులర్ క్యాంప్‌లు .. ఊపిరి పీల్చుకున్న ఇండియన్ ఎంబసీ

ఖలిస్తాన్ ( Khalistan )వేర్పాటువాదుల బెదిరింపుల మధ్య కెనడాలో భారత రాయబార కార్యాలయం నిర్వహించిన కాన్సులర్ క్యాంప్‌లు ప్రశాంతంగా ముగిశాయి.

సీనియర్ సిటిజన్‌లకు, ఇతర ప్రవాస భారతీయులకు అవసరమైన లైఫ్ సర్టిఫికేట్‌లను జారీ చేయడానికి కెనడాలోని భారతీయ మిషన్లు నిర్వహించిన కాన్సులర్ క్యాంప్‌లు ఆదివారం బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలోని బాంక్వెట్ హాల్‌లో ముగిశాయి.

చివరి శిబిరాన్ని వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ నిర్వహించింది.నిజానికి దీనిని తొలుత లక్ష్మీనారాయణ్ మందిర్‌లో ( Lakshminarayan Mandir )నిర్వహించాలని అనుకున్నారు.

అయితే బ్రాంప్టన్‌లో హిందూ మందిర్‌పై ఖలిస్తాన్ వేర్పాటువాదులు దాడి చేయడం కాన్సులర్ క్యాంప్‌లపై ప్రభావం చూపాయి.

ఈ శిబిరాలకు తాము భద్రత కల్పించలేమని కెనడియన్ భద్రతా ఏజెన్సీలు చేతులెత్తేయడంతో భారతీయ మిషన్‌లు( Indian Missions ) చాలా వరకు క్యాంప్‌లను రద్దు చేశాయి.

"""/" / అంటారియోలోని లండన్ పట్టణంలోని( London, Ontario ) సెంటర్‌లో ఆదివారం జరగాల్సిన చివరి శిబిరాన్ని నిర్వాహకుల అభ్యర్ధన మేరకు రద్దు చేసినట్లు టొరంటోలోని భారత కాన్సులేట్ ప్రకటించింది.

కెనడాలో స్థిరపడిన ప్రవాస భారతీయులకు , సీనియర్ సిటిజన్‌లకు అవసరమైన సేవలు అందించేందుకు గాను వారికి అనుకూలంగా ఉండే ప్రదేశాల్లో భారతీయ మిషన్లు కాన్సులర్ క్యాంప్‌లను నిర్వహిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

"""/" / అయితే ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ ( Hardeep Singh Nijjar )హత్య , కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌పై చేసిన ఆరోపణలతో పరిస్ధితులు అదుపు తప్పాయి.

నాటి నుంచి కెనడాలోని భారతీయ మిషన్‌లు టార్గెట్‌గా ఖలిస్తాన్ మద్ధతుదారులు దాడులకు తెగబడుతున్నారు.

దీనికి తోడు నిజ్జర్ కేసు దర్యాప్తులో అనుమానితుల జాబితాలో కెనడాలో నాటి భారత హైకమీషనర్ పేరును చేర్చడం అత్యంత వివాదాస్పదమైంది.

దీనిపై భగ్గుమన్న న్యూఢిల్లీ.అక్టోబర్ 14న కెనడా నుంచి ఆరుగురు దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించి, భారత్‌లోని ఆరుగురు కెనడియన్ దౌత్యవేత్తలను బహిష్కరించింది.

నాటి నుంచి ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారాయి.

మమ్మల్ని వదిలేయండి.. చెత్త కామెంట్లు పెట్టొద్దు.. దివ్య శ్రీధర్ కామెంట్స్ వైరల్!