చైనాలో ఇండియన్ స్టూడెంట్ మృతి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని సాయం కోరిన కుటుంబం..

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు ఎన్నో దేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉంటారు.

మన దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల నుంచి అమెరికా, ఫ్రాన్స్, చైనా లాంటి ఎన్నో దేశాలలో మన దేశ విద్యార్థులు చాలా మంది వెళ్లి ఉన్నత చదువులు చదువుకుంటూ ఉంటారు .

అలా చదువుకుంటున్న విద్యార్థులలో కొంత మంది తమ ఉన్నత విద్య పూర్తి చేసి భారతదేశానికి తిరిగి వచ్చి మన దేశానికి సేవ చేస్తూ ఉంటారు.

కానీ మరి కొంత మంది విద్యార్థులు ఆ దేశాలలోనే ఉండి అక్కడే వాళ్లకి తోచిన ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు.

కానీ అలా వేరే దేశాలకు వెళ్లి చదువుకుంటున్న కొంత మంది విద్యార్థులు కొన్ని ప్రమాదాల వల్ల లేదా అనారోగ్యాల వల్ల చనిపోతూ ఉంటారు.

తాజాగా చైనాలో చదువుకుంటున్న భారత వైద్య విద్యార్థి అనారోగ్య కారణంగా మృతి చెందాడు.

ఈ విద్యార్థి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకోవాలని బాధిత కుటుంబం ప్రభుత్వ సహాయం కోరింది.

తమిళనాడు రాష్ట్రానికి చెందిన అబ్దుల్ షేక్ ఐదేళ్ల క్రితం మెడిసిన్ చదువుకునేందుకు చైనా వెళ్ళాడు.

ప్రస్తుతం అతడు కికిహార్ మెడికల్ యూనివర్సిటీలో ఇంటర్షిప్ చేస్తున్నాడు. """/"/ ఈ మధ్య కాలంలో భారత్ కు వచ్చిన అబ్దుల్ డిసెంబర్ 11న మళ్లీ చైనాకు వెళ్ళాడు.

8 రోజుల క్వారెంటేన్ పూర్తి చేసుకున్న తర్వాత మళ్లీ ఎప్పటిలాగే సాధారణంగా ఉండిపోయాడు.

ఇంకా చెప్పాలంటే ఈ క్రమంలోనే అబ్దుల్ అనారోగ్యానికి గురవడంతో వైద్యులు ఐసిఓలో ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు.

అతడి ఆరోగ్యం క్షీణించడంతో అబ్దుల్ మృతి చెందాడు.ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అబ్దుల్ కుటుంబం అతడి మృతదేహాన్ని సదేశానికి తరలించేందుకు సాయం చేయాలని విదేశాంగ శాఖను అభ్యర్థిస్తూ ఉంది.

ఈ విషయంలో ఆదుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది.

అమ్మాయి గెటప్ లో అదిరిపోయిన విశ్వక్ సేన్.. లైలా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్!