ప్రియురాలిపై హత్యాయత్నం.. భారతీయుడికి 16 ఏళ్ల జైలు , యూకే కోర్టు సంచలన తీర్పు

యూకేలో మాజీ ప్రియరాలిపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో భారతీయుడికి 16 ఏళ్లు జైలు శిక్ష విధించింది కోర్ట్.

రెండేళ్ల క్రితం తూర్పు లండన్‌లోని భారతీయురాలైన విద్యార్ధినిపై నిందితుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు.నిందితుడిని శ్రీరామ్ అంబర్లగా( Sriram Ambarla ) గుర్తించారు.

తూర్పు లండన్‌లోని( London ) హైదరాబాదీ రెస్టారెంట్‌లో మహిళను కత్తితో పొడవగా.సంఘటనా స్థలంలోనే అతనిని అరెస్ట్ చేశారు.

ఈ గురువారం శ్రీరామ్ తన నేరాన్నీ ఓల్డ్ బెయిలీ కోర్టులో అంగీకరించాడు.కోర్టు నివేదిక ప్రకారం.

వారిద్దరూ 2022లో యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్‌లో( University Of East London ) చదువుకోవడానికి వచ్చారు.

అక్కడ శ్రీరామ్ ఆమె వెంటపడ్డాడు.అదే ఏడాది మార్చిలో హత్యాయత్నానికి ముందు శారీరకంగానూ బాధితురాలిని వేధించాడు.

ఈస్ట్ లండన్‌లోని ఓ రెస్టారెంట్‌లో వెయిట్రెస్‌గా ( Waitress ) పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్న 20 ఏళ్ల బాధిత విద్యార్ధిని పేరును ప్రస్తావించలేదు.

అయితే ఆమె కేరళకు( Kerala ) చెందిన యువతిగా సమాచారం. """/" / తీర్పు సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆమె చావు వెంట్రుక వాసిలో తప్పిపోయిందన్నారు.నిరవధిక నిలుపుదల ఉత్తర్వు కింద బాధితురాలిని నిందితుడు మరోసారి సంప్రదించకుండా నిషేధించారు.

కోర్టు నివేదిక ప్రకారం.భయంకరమైన ఫుటేజీలో బాధితురాలిపై 9 కత్తిపోట్లకు సంబంధించిన ఆధారాలు వున్నట్లు మీడియా సాక్ష్యంగా పేర్కొంది.

బాధితురాలు ఆరు సర్జరీలు చేయించుకుని దాదాపు నెల రోజుల పాటు క్రిటికల్ కేర్‌లో వుంది.

"""/" / కాగా.మరో ఘటనలో పరాయి వ్యక్తులతో సంబంధాలు కలిగి వుందన్న కక్షతో తన ప్రియురాలిని హత్య చేసిన ఘటనలో భారత సంతతికి చెందిన వ్యక్తికి సోమవారం సింగపూర్ కోర్ట్ 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

ఇతర పురుషులతో ఆమెకు వున్న సంబంధాల గురించి తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురైన నిందితుడు ఎం కృష్ణన్ జనవరి 17, 2019న మల్లికా బేగం రహమాన్సా అబ్దుల్ రెహమాన్‌ (40)ని కొట్టాడు.

గతవారం కృష్ణన్ హైకోర్టులో ఈ నేరాన్ని అంగీకరించినట్లు ‘‘టుడే’’ వార్తాపత్రిక సోమవారం నివేదించింది.

ఘాటి గ్లింప్స్ రివ్యూ.. అనుష్క ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అంటూ?