5-స్టార్ హోటల్‌లో ఫ్రీగా బ్రేక్‌ఫాస్ట్ చేసి తప్పించుకోవాలనుకున్న యువతి.. చివరకు ఏం జరిగిందో తెలిస్తే షాక్!

5-స్టార్ హోటల్‌లో ఫ్రీగా బ్రేక్‌ఫాస్ట్ చేసి తప్పించుకోవాలనుకున్న యువతి చివరకు ఏం జరిగిందో తెలిస్తే షాక్!

ప్రముఖ ఇండియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ నిషు తివారీ( Nishu Tiwari ) ఢిల్లీలోని చాణక్యపురిలో ఉన్న ఒక 5-స్టార్ హోటల్‌లో( 5-Star Hotel ) డేరింగ్ ప్రాంక్ చేసింది.

5-స్టార్ హోటల్‌లో ఫ్రీగా బ్రేక్‌ఫాస్ట్ చేసి తప్పించుకోవాలనుకున్న యువతి చివరకు ఏం జరిగిందో తెలిస్తే షాక్!

తన "అన్‌ఎథికల్ లైఫ్ హ్యాక్స్" సిరీస్‌లో భాగంగా, ఉచితంగా బ్రేక్‌ఫాస్ట్( Free Breakfast ) కొట్టేయాలని ప్లాన్ వేసింది.

5-స్టార్ హోటల్‌లో ఫ్రీగా బ్రేక్‌ఫాస్ట్ చేసి తప్పించుకోవాలనుకున్న యువతి చివరకు ఏం జరిగిందో తెలిస్తే షాక్!

కానీ, ఆమె ప్లాన్ బెడిసికొట్టి చివరకు రూ.3,658 కట్టాల్సి వచ్చింది.

పైజమా, హోటల్ రోబ్‌లో రెడీ అయిపోయి, తానే హోటల్ గెస్ట్‌లా బిల్డప్ ఇచ్చింది నిషు.

తన టీమ్ మెంబర్‌తో కలిసి ఒక బ్లాగులో దొరికిన ఫేక్ రూమ్ నంబర్ 3206 వాడారు.

వాళ్ల ట్రిక్ మొదట్లో బాగానే వర్కౌట్ అయింది.హోటల్ స్టాఫ్ ఏ మాత్రం అనుమానించకుండా బ్రేక్‌ఫాస్ట్ ఏరియాకి తీసుకెళ్లారు.

దాంతో లొట్టలేసుకుంటూ ఫుడ్ లాగించేశారు.తన హ్యాక్ సక్సెస్ అయిందని నిషు కెమెరా ముందు సంబరపడిపోయింది.

"""/" / అయితే, ఆమె టీమ్‌మేట్ పొరపాటున ఫోన్ మర్చిపోయాడు.తిరిగి దాన్ని తీసుకోవడానికి వెళ్లినప్పుడు, హోటల్ స్టాఫ్ రూమ్ నంబర్ వెరిఫై చేశారు.

అప్పుడే 3206 రూమ్ నంబర్ ఇంకో గెస్ట్‌కి చెందినదని తేలింది.దాంతో నిలదీయడంతో ముందు "మేం పొరపాటున రాంగ్ ప్లేస్‌కి వచ్చాం" అని కవర్ చేసే ప్రయత్నం చేసింది నిషు.

కానీ, చివరికి తాము హోటల్ గెస్ట్‌లం కాదని ఒప్పుకొని బిల్లు కట్టేసింది. """/" / తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్‌ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది నిషు.

హోటల్ స్టాఫ్ అంతా నవ్వుకున్నారని, లైట్ తీసుకున్నారని చెప్పుకొచ్చింది."వాళ్లు మాతో కలిసి నవ్వారు.

మేం వాళ్లని ఫూల్ చేయగలిగామని ఆశ్చర్యపోయారు" అని చెప్పింది.తన పోస్ట్‌కి "ఫ్రీ మీల్ కాస్తా కాస్ట్లీ అయిపోయింది" అని క్యాప్షన్ కూడా అదిరిపోయేలా పెట్టింది.

వీడియో వైరల్( Viral Video ) అయిపోయింది.ఏకంగా 20 లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.

కానీ, నెటిజన్లు మాత్రం ఆమెను ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు.ఇలాంటి అన్‌ఎథికల్ పనులు ప్రమోట్ చేయడమేంటని దుమ్మెత్తిపోశారు.

"సిగ్గుండాలిరా మీకు," అని ఒక యూజర్ కామెంట్ చేస్తే, ఇంకొకరు "ఇలాంటి ఐడియాలు ఎందుకు ప్రమోట్ చేస్తారు? ఇది అస్సలు ఫన్నీగా లేదు" అని ఫైర్ అయ్యారు.

కొందరైతే, వీడియో తీయకుండా ఉంటే బహుశా ఈ ప్రాంక్ వర్కౌట్ అయ్యేదేమో అని అభిప్రాయపడ్డారు.

ముఖంపై నలుపు పేరుకుపోయిందా.. సులభంగా వదిలించుకోండిలా..!

ముఖంపై నలుపు పేరుకుపోయిందా.. సులభంగా వదిలించుకోండిలా..!