సింగపూర్: చిన్న సాయం.. ఓవర్‌నైట్‌లో స్టార్‌గా మారిపోయిన భారతీయుడు

నిలువెల్లా స్వార్థం.ప్రతి పనిలోనూ లాభం మనిషిని పూర్తిగా ఆక్రమించేసిన వేళ మానవత్వం మచ్చుకైనా కానరావడం లేదు.

అయితే కొందరు మనసున్న మారాజులు మాత్రం మనిషిలో మానవత్వం ఇంకా బతికే వుందని నిరూపిస్తున్నారు.

తోటి వ్యక్తికి సాయం చేయడం అంటే ఒక్క డబ్బే ఇవ్వడమే కాదు.చాలా రూపాల్లో అది చూపించుకోవచ్చు.

మనం చేసే చిన్న చిన్న సాయాలే ఒక్కొసారి ఎదుటి వ్యక్తి ప్రాణాలను కూడా కాపాడొచ్చు.

తాజాగా సింగపూర్‌లో ఓ వృద్ధుడిని రోడ్డు దాటించి ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడో భారత సంతతి యువకుడు.

వివరాల్లోకి వెళితే.తమిళనాడులోని శివగంగకు చెందిన గుణశేఖరన్ మణికందన్ సింగపూర్‌లో ల్యాండ్ సర్వే అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.

ఓ రోజున విధుల్లో భాగంగా పెద్ద రెసిడెన్షియల్ ఎస్టేల్ వద్ద వున్నాడు.ఆ సమయంలో అక్కడికి దగ్గరలో దృష్టి లోపం వున్న వృద్ధుడు రోడ్డు దాటేందుకు ఎంతోసేపటి నుంచి ఇబ్బంది పడుతున్నాడు.

దీనిని గమనించిన గుణశేఖరన్ అక్కడికి వెళ్లి.ఆ పెద్దాయన చేతిని పట్టుకుని వాహనాలను నిలువరిస్తూ రోడ్డు దాటించాడు.

ఏప్రిల్ 18న జరిగిన ఈ తతంగాన్ని ఎవరో సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి దానిని సోషల్ మీడియాలో పెట్టారు.

దీనిని చూసిన గుణశేఖరన్ స్నేహితులు అతనికి తెలిపారు.ఈ యువకుడు చేసిన సాయం వూరికేపోలేదు.

విషయం ఆనోటా ఈ నోటా సింగపూర్ మానవశక్తి మంత్రిత్వ శాఖ వరకు వెళ్లింది.

ఈ విభాగానికి చెందిన అధికారులు గుణశేఖరన్‌ను గుర్తించి.అతను పనిచేస్తున్న చోటికి వెతుక్కుంటూ వెళ్లారు.

పెద్దాయనకు చేసిన సాయానికి గాను అభినందనలతో పాటు రివార్డును అందజేశారు.ఇందుకు సంబంధించిన ఫోటోలను అధికారులు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

అందులో ఓ అధికారి.గుణశేఖరన్‌కు ఒక పెద్ద బ్యాగ్‌ను అందిస్తున్నట్లుగా వుంది.

రివార్డ్‌ను తాను మిత్రులతో కలిసి పంచుకుంటానని సదరు భారతీయుడు తెలిపాడు.వృద్ధుడికి సాయం చేయడం తన బాధ్యత అన్న గుణశేఖరన్‌.

తనను ఎవరో వీడియో తీస్తున్నారన్న విషయం తెలియదన్నాడు.అలాగే భారత్‌లో వుంటున్న తన తల్లి వీడియో చూసి తనను అభినందించడం గర్వంగా వుందని గుణశేఖరన్ ఉద్వేగానికి గురయ్యాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎంతో మంది నెటిజన్లు అతనిని ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

రోజు నైట్ ఈ హోమ్ మేడ్ క్రీమ్ వాడితే స్పాట్ లెస్ అండ్ బ్రైట్ స్కిన్ పొందొచ్చు.. తెలుసా?