యూఏఈ నుంచీ వచ్చేస్తాం..1.50 వేలమంది భారతీయుల అభ్యర్ధన..!!!

కరోన వేలాది మంది జీవితాలని కాటేసింది.లక్షలాది మంది కరోనా సోకి ఆందోళన చెందుతున్నారు.

వివిధ దేశాలలో ఉంటున్న విదేశీయుల పరిస్థితి మరీ ఘోరంగా తయారయ్యింది.ఒక పక్క ఉద్యోగాలు పోవడంతో వారి మరీ దయనీయంగా మారిపోయింది.

దాంతో దిక్కు తోచని స్థితిలో విదేశాలకి వెళ్ళిన భారతీయులు తిరిగి భారత్ వచ్చేస్తామని అభ్యర్దిస్తున్నారు.

భారత్ నుంచీ ఎంతో మంది వలస కూలీలు అత్యధికంగా వెళ్ళేది యూఏఈ కి.

ప్రస్తుతం అక్కడ ఉన్న దాదాపు 1.50 వేలమంది భారత్ వచ్చేస్తామని అంటున్నారు.

దుబాయ్ లోని కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా మీడియాకి తెలిపిన వివరాల ప్రకారం కేవలం నిన్న ఒక్క రోజులో 1.

50 వేల మందికి పైగా భారతీయులు ఇండియా వెళ్లిపోతామని రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారట.ఇలా అభ్యర్ధన పెట్టుకున్న వారిలో చాలామంది ఉద్యోగాలు కోల్పోవడం ద్వారా స్వదేశానికి రావాలని అనుకుంటున్నారట.

వీరిలో దాదాపు 40 శాతం మంది బ్లూ కాలర్ కార్మికులు కాగా 20 శాతం మంది వర్కింగ్ ప్రొఫిషనల్స్ ఉన్నారు.

ఈ అభ్యర్ధన చేసుకున్న వారిలో అత్యధికంగా కేరళా వాసులు ఉన్నారని వారు సుమారు 50 శాతం పైనే ఉన్నారని తెలిపారు.

అత్యంత స్వల్పంగా గర్భిణులు , వైద్య సాయం అందించే వారు ఉన్నారని తెలిపారు.

అయితే అభ్యర్ధనలు వచ్చాయి కానీ వీరిని స్వదేశానికి తరలించమని ఎలాంటి ఆదేశాలు రాలేదని అంటున్నారు అధికారులు.

ఎన్టీఆర్ బంధువు చిత్రంలో రామోజీరావు కనిపించిన సినిమా ఏంటో తెలుసా..??