ఇండియన్ ఐడల్ 12 టైటిల్ విజేత ఎవరంటే.??
TeluguStop.com
ఇండియన్ పాపులర్ సింగింగ్ రియాలిటీ షో ఫైనల్స్ కి చేరిన విషయం తెలిసిందే.
ఈసారి ఫైనల్ స్టేజ్ కి మన తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియా కూడా సెలెక్ట్ అవ్వడం విశేషం అనే చెప్పాలి.
హోరా హోరీగా సాగే ఈ పాటల పోటీలో ఫైనల్ విన్నర్ ఎవరనేది తెలిసిపోయింది.
ఈ సంవత్సరం "ఇండియన్ ఐడల్ 12' ట్రోఫీని సింగర్ పవన్ దీప్ రాజన్ దక్కించుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
సింగర్ పవన్ దీప్ కు సంబందించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఈ ఫోటోలలో పవన్ దీప్ ఒక చేతితో టైటిల్ విన్నర్ ట్రోఫీని పట్టుకుని ఉండగా మరో చేత్తో రూ.
25 లక్షల చెక్ పట్టుకుని ఉండటం మనం గమనించవచ్చు.దీనిని బట్టి చూస్తే ఇండియన్ ఐడల్ విన్నర్ పవన్ దీప్ అనే విషయం స్పష్టం అవుతుంది.
ఎక్కడో ఒక మారుమూల ప్రదేశం నుంచి వచ్చిన పవన్ దీప్ ఇప్పుడు ఎంతో కష్టపడి తనకు ఉన్న సింగింగ్ టాలెంట్ తో ఇండియన్ ఐడల్ 12 టైటిల్ గెలుచుకోవడం చూసి అందరు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
టైటిల్ విన్ అవ్వడంతో పాటు తాను గెలుచుకున్న ప్రైజ్ మనీ మాత్రమే కాకుండా మరొక ఆఫర్ కూడా అందుకున్నాడు పవన్.
ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్‌లో ఒక పాట పాడే మంచి అవకాశం కూడా వచ్చినట్లు తెలుస్తుంది .
"""/"/
అలాగే ఈ పాట ఒక్కటే కాకుండా టీ - సిరీస్ అనే ఆడియో కంపెనీకి కంపోజర్ గా కూడా ఉండే మంచి ఛాన్స్ కొట్టేసాడు పవన్.
ఈ విషయాన్నీ షో కి అతిధిగా వచ్చిన ప్రముఖ లిరిసిస్ట్ మనోజ్ ముంతాషిర్ చెప్పారు.
పవన్ షో స్టార్ట్ అయిన దగ్గర నుండి తన పెర్ఫార్మన్స్ తో అటు జడ్జిలను ఇటు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చాడు.
అంతేకాకుండా పియానో తోపాటు గిటార్ కూడా ప్లే చేస్తూ కూడా పాడగల సత్తా అతనిలో ఇమిడి ఉంది.
ఇకపోతే ఇండియన్ ఐడల్ 12 గ్రాండ్ ఫినాలేలో ఆరుగురు కంటెస్టెంట్స్ పాల్గొన్నారు.
16 ఏళ్లకే ఇంజనీర్ అవతారం.. మనిషిని మోసుకెళ్లే డ్రోన్ తయారు చేసి ఔరా అనిపించాడు..