కింగ్ ఛార్లెస్ IIIతో యూకేలోని భారత హైకమీషనర్ భేటీ.. నియామక పత్రాల అందజేత

యూకేలోని భారత హైకమీషనర్ విక్రమ్ దొరైస్వామి లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ చార్లెస్ IIIని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా తన పోస్టింగ్‌కు సంబంధించిన పత్రాలను ఆయనకు అధికారికంగా సమర్పించారు.బ్రిటన్‌కు సుదీర్ఘకాలం మహారాణిగా వ్యవహరించిన క్వీన్ ఎలిజబెత్ II ఈ ఏడాది సెప్టెంబర్‌లో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

ఈ తర్వాత రాజభవనానికి వచ్చిన తొలి భారత రాయబారి దొరైస్వామియే.గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో విక్రమ్ దొరైస్వామి, ఆయన సతీమణి సంగీతను వారి అధికారిక నివాసం నుంచి రాజభవనానికి గుర్రపు బండిపై తీసుకొచ్చారు.

వారి వెంట డిప్యూటీ హైకమీషనర్ సుజిత్ ఘోష్, సీనియర్ అధికారులు వున్నారు.రాయల్ ప్యాలెస్‌లో తనకు దక్కిన గౌరవంపై విక్రమ్ దొరైస్వామి ట్వీట్ చేశారు.

కింగ్ చార్లెస్‌కు భారతదేశంపై వున్న అప్యాయత మరోసారి రుజువైందన్నారు.భారత్- యూకే సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి ఆలోచనలు, ప్రణాళికలను రూపొందించడానికి ఇది తనకు దక్కిన అవకాశమన్నారు.

"""/"/ కాగా.ఉజ్బెకిస్తాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో భారత రాయబారిగా , బంగ్లాదేశ్‌లో భారత హైకమీషనర్‌గా పనిచేసిన విక్రమ్ దొరైస్వామి.

తన అధికారిక పత్రాలను దేశాధినేతకు సమర్పించడం ఆయన కెరీర్‌లో ఇది నాల్గోసారి.యూకేలో భారత హైకమీషనర్‌గా నియమితులైన అనంతరం ఆయన ఈ ఏడాది సెప్టెంబర్‌ 23న లండన్‌ చేరుకున్నారు.

ఈ సందర్భంగా పార్లమెంట్ స్క్వేర్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి, నార్త్ లండన్‌లోని అంబేద్కర్ మ్యూజియం వద్ద నివాళులర్పించారు.

Purandhveswari : ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి..: పురంధ్వేశ్వరి