యూకే విద్యార్ధులకు భారత్ శుభవార్త.. ఆ స్కీమ్ కింద వీసా దరఖాస్తులకు ఆహ్వానం

యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కింద యూకే విద్యార్ధుల వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను లండన్‌లోని భారత హైకమీషన్ ప్రారంభించింది.

ఇప్పటికే భారతీయ గ్రాడ్యుయేట్ల కోసం న్యూఢిల్లీలోని బ్రిటీష్ హైకమీషన్ వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్‌ ప్రారంభించడంతో దీనికి సమాంతరంగా భారత్ కూడా రంగంలోకి దిగింది.

దీనికి సంబంధించిన వివరాలను బ్రిటన్‌లోని భారత హైకమీషనర్ విక్రమ్ దొరైస్వామి ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

ఒక నెల క్రితం ప్రకటించిన యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కింద భారత్-యూకేలకు చెందిన యువకులు అర్హులని ఆయన చెప్పారు.

ఫిబ్రవరి 28 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని.దీనిని న్యూఢిల్లీ , లండన్‌లలో ఏకకాలంలో ప్రారంభిస్తామని దొరైస్వామి చెప్పారు.

"""/" / దరఖాస్తుదారులు తమ వివరాలను పూర్తి చేయడంతో పాటు 720 పౌండ్ల రుసుము చెల్లించాలని ఇండియన్ హైకమీషన్ వెబ్‌సైట్‌లో తెలిపింది.

"ఈ 1" వీసా కింద దరఖాస్తును ప్రాసెస్ చేస్తామని.వీఎఫ్‌ఎస్ గ్లోబల్ వీసా సర్వీస్ ప్రొవైడర్ ఈ విధులు నిర్వర్తిస్తుందని హైకమీషన్ పేర్కొంది.

అలాగే ప్రతి దరఖాస్తుదారుడు దరఖాస్తును సమర్పించే సమయంలో కనీసం 30 రోజులు పాటు బ్యాంక్‌లో వుంచిన 2,50,000కు సమానమైన నిధులను చూపించాల్సి వుంటుందని పేర్కొంది.

దరఖాస్తులకు అంగీకారం లభించిన వారు భారత్‌లో ఉపాధి పొందవచ్చు.అయితే రక్షణ, టెలికాం, స్పేస్ టెక్, వ్యూహాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లు, పౌర విమానయానం, మానవ హక్కుల వంటి రంగాలు ఈ స్కీమ్ పరిధిలోకి రావని కమీషన్ వెల్లడించింది.

కొత్త వీసాపై భారత్‌కు వచ్చేవారు ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ లేదా ఫారిన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలి.

"""/" / గతేడాది నవంబర్‌లో ఇండోనేషియాలో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటీష్ ప్రధాని రిషి సునక్ మధ్య ఈ స్కీమ్‌కు సంబంధించి సంతకాలు జరిగాయి.

18 నుంచి 30 సంవత్సరాల వయసున్న భారత్- బ్రిటన్ పౌరులు ఏ దేశంలోనైనా కొంతకాలం పాటు నివసించడానికి , పనిచేసుకోవడానికి ఈ యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ వీలు కల్పిస్తుంది.

ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు రెండేళ్ల పాటు గ్రాడ్యుయేట్ డిగ్రీ, వారి బసకు అండగా నిలవాలని ఇరుదేశాలు ఒప్పందం చేసుకున్నాయి.

గూస్ బాంబ్స్ పక్కా.. దేశం కోసం సైన్యం ఎలా కష్టపుడుతుందో చూసారా ఎప్పుడైనా?