గ్రీన్‌కార్డుల జారీపై కీలక బిల్లును అడ్డుకున్న సెనేటర్: అమెరికాలో భారతీయుల నిరసన

అమెరికా ఆర్ధిక వ్యవస్థను అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దడంలో భారతీయుల పాత్ర మరవలేనిది.కానీ అక్కడి స్థానికులు, కొందరు ప్రజా ప్రతినిధులు మాత్రం మనపై విద్వేషాన్ని చూపిస్తూ ఉంటారు.

తాజాగా భారతీయులపై విద్వేషంతో ఓ సెనేటర్ చేసిన పనికి గ్రీన్‌కార్డుల జారీకి సంబంధించిన ఓ కీలక బిల్లు నిలిచిపోయింది.

అమెరికాలో ఎప్పటి నుంచో ఉంటున్న వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, ఇతర నైపుణ్యం గల ఉద్యోగులు గ్రీన్ కార్డు కోసం సుధీర్ఘకాలం నిరీక్షించాల్సి వస్తోంది.

దీంతో ప్రస్తుతం అమల్లో వున్న విధానంలో మార్పులు తెస్తూ ‘‘ First Come First Serve System’’ విధానంతో గ్రీన్ కార్డులు జారీ చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది.

దీనిలో భాగంగా ‘‘ ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమ్మిగ్రంట్స్ యాక్ట్’’ పేరిట బిల్లును తీసుకువచ్చారు.

దీని ద్వారా ప్రస్తుతం ఉద్యోగ వీసాలపై దశలవారీగా ఉన్న ఏడు శాతం పరిమితిని తొలగించాలని నిర్ణయించారు.

అయితే దీనిని డెమొక్రటిక్ పార్టీకి చెందిన సెనేటర్ డిక్ డర్బిన్ వ్యతిరేకించారు.అంతే బిల్లు సెనేట్‌లోనే నిలిచిపోయింది.

"""/"/ ఆయన తీరు భారతీయ హెచ్ 1 బీ వీసాదారులకు ఆగ్రహం తెప్పించింది.

భారతీయుల పట్ల ఉన్న విద్వేషాన్ని వదులుకోవాలంటూ బుధవారం వాషింగ్టన్‌లో ‘‘ ఈక్వాలిటీ ర్యాలీ’’ పేరిట ఆందోళనకు దిగారు.

అమెరికా ఆర్ధిక వ్యవస్థకు ఏళ్లుగా కృషి చేస్తున్న వారికి గ్రీన్ కార్డుల జారీని అడ్డుకోవడం అన్యాయమన్నారు.

అలాగే గ్రీన్ కార్డుల జారీలో ఉన్న బ్యాక్‌లాగ్‌ని కూడా క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుత నిరీక్షణ సమయం ఇలాగే కొనసాగితే గ్రీన్‌కార్డు జారీకి 150 ఏళ్లు పట్టే అవకాశం వుందని తెలిపారు.

ఆశ్రయం కోసం దేశంలోకి అక్రమంలోకి వచ్చిన మైనర్లకు కల్పించే అన్ని హక్కుల్నీ చట్టబద్ధంగా అమెరికాలోకి వచ్చిన మైనర్లకు కూడా కల్పించాలని భారతీయులు డిమాండ్ చేశారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?