భారతీయులకు శుభవార్త .. ఇకపై అమెరికాలోనే హెచ్ 1 బీ వీసా రెన్యూవల్

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నిపుణులైన కార్మికులు పని చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్ 1 బీ వీసాకు( H-1B Visa ) సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం( US Govt ) భారతీయులకు శుభవార్త చెప్పింది.

హెచ్ 1 బీ వర్కింగ్ వీసాను కలిగివున్న భారతీయులు , విదేశీయులు తమ స్వదేశానికి తిరిగి వెళ్లకుండానే ఇకపై యూఎస్‌లోనే తమ వీసాలను పునరుద్దరించుకోవచ్చు.

గతంలో హెచ్ 1 బీ వీసాదారులు తమ వీసాలను రెన్యూవల్ చేయించుకోవాలంటే తమ దేశంలోని యూఎస్ కాన్సులేట్‌కు( US Consulate ) వెళ్లాల్సి ఉండేది.

అలాంటి వారు ఇకపై హెచ్ 1 బీ వీసా పొడిగింపు లేదా పునరుద్ధరణ కోసం స్వదేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు.

దీనికి సంబంధించి ఢిల్లీలోని యూఎస్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది.హెచ్ 1 బీ వీసా హోల్లర్లంతా దేశం విడిచి వెళ్లకుండానే తమ పత్రాలను పునరుద్ధరించుకునేలా రెన్యువల్ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపింది.

"""/" / హెచ్ 1 బీ వీసాదారులు( H-1B Visa Holders ) అమెరికాను వదిలి బయటికి రావడంతో పాటు వారి స్వదేశాల్లోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయాల్లో అపాయింట్‌మెంట్ పొందేందుకు నిరీక్షణను ఎదుర్కొంటున్నారు.

కొత్త విధానం ప్రకార అమెరికాలో ఉన్నప్పుడే యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌కు వారి పత్రాలను మెయిల్ చేయడం ద్వారి వారి వీసాలను పునరుద్ధరించుకోవచ్చు.

ఇప్పటికే కొన్ని దేశాలకు సంబంధించి పైలట్ ప్రోగ్రామ్ విజయవంతం కావడంతో అమెరికా ప్రభుత్వం ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

"""/" / హెచ్ 1 బీ అనేది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా.ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో విదేశీ వృత్తి నిపుణులను నియమించుకునేందుకు గాను అమెరికన్ కంపెనీలకు అనుమతిస్తుంది.

ఈ వీసా కింద భారత్, చైనా తదితర దేశాల నుంచి ప్రతియేటా వేల మంది ఉద్యోగులను టెక్ దిగ్గజాలు నియమించుకుంటున్నాయి.

ప్రతి ఏడాదీ అమెరికా 85,000 హెచ్‌-1బి వీసాల‌ను మంజూరు చేస్తుంది.ఇందులో 70% వాటా భారతీయులదే కావడం విశేషం.

డాకు మహారాజ్ మూవీ హిందీ వెర్షన్ కు అదే మైనస్ అయిందా.. ఏం జరిగిందంటే?