పుల్వామా ఎఫెక్ట్! వేర్పాటు వాదులకి భద్రత తొలగింపు!

పుల్వామాలో సిఆర్పీఎఫ్ భద్రత సిబ్బందిపై టెర్రరిస్ట్ ల ఆత్మాహుతి దాడిని ప్రతీకార చర్యలని భారత్ మొదలుపెట్టింది.

దేశంలో ఉంటూ టెర్రరిస్ట్ లకి, పాకిస్తాన్ కి కొమ్ము కాస్తున్న కాశ్మీర్ వేర్పాటు వాద నాయకులకి ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది.

ఇంతకాలం కాశ్మీర్ వేర్పాటు వాదులకి భారతీయుల నుంచి ఎలాంటి ప్రమాదం లేకుండా భద్రత కల్పించిన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నపళంగా వారికి భద్రతని తొలగించింది.

మరో వైపు పాకిస్తాన్ పై ప్రతీకార దాడులకి సిద్ధమైయ్యే ప్రయత్నంలో రక్షణ దళాలు వున్నాయి.

దీంతో ప్రమాదాన్ని పసిగట్టిన పాకిస్తాన్ ఆర్మీ, తాము స్థావరం కల్పిస్తున్న మిలిటెంట్లని ఆర్మీ స్తావరాలలోకి తరలించింది.

ఇదిలా వుంటే కాశ్మీర్ లో వేర్పాటువాదులకి భద్రతని తొలగించడంతో వారి మద్దతుదారులు, ఉగ్రవాద సానుబూతి పరులు కాశ్మీర్ లో నిరసనకి దిగి విద్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.

కాశ్మీర్ లో ఓ బస్సుని ఇప్పటికే నిరసన కారులు దగ్ధం చేసినట్లు తెలుస్తుంది.

శాంతి భద్రతలు అదుపు తప్పడంతో భద్రతా దళాలు రంగంలోకి దిగాయి.144 సెక్షన్ విధించి, నిరసన కారులు బయటకి రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసారు.

వేర్పాటువాదుల నుంచి సామాన్య కాశ్మీర్ ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇలాంటి పరిస్థితిలో సరిహద్దులో మళ్ళీ యుద్ధ వాతావరణం కనిపిస్తుంది.అయితే కేంద్రం ప్రభుత్రం ఇచ్చే ఆదేశాలపై రక్షణ దళాలు యాక్షన్ కోసం బోర్డర్ లో ఎదురుచూస్తున్నాయి.