ఆ 8 మంది ఎన్నారై భర్తలకి కేంద్రం షాక్..

కేంద్రం తాజాగా ఎన్నారై భర్తలపై ప్రవేశపెట్టిన బిల్లు మొదటి సారిగా అమలు అయ్యింది.

భార్యలని వదిలేసిన 8 మంది ఎన్నారై భర్తలకు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది.

నేరస్థులుగా పరిగణించబడుతున్న వారి పాస్‌పోర్టులను రద్దు చేస్తున్నట్లు మహిళ మరియు శిశు అభివృద్ధి మంత్రిశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి శుక్రవారం ప్రకటించారు.

ఈ ప్రకటన ఒక్క సారిగా భార్యలని వదిలేసి ఉంటున్న ఎన్నారై భర్తలు ఉలిక్కిపడేలా చేసింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అంతేకాదు ఈ కేసు ఎక్కడా వీగిపోకుండా ఉండటానికి విదేశీవ్యవహారాల శాఖా, హోంమంత్రిత్వశాఖా, మహిళ మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ సంయుక్తంగా నియమించిన ఓ కమిటీని నియమించారు.

ఈ కమిటీకి కేవలం రెండు నెలల వ్యవధిలో మొత్తం 70 ఫిర్యాదులు అందాయి.

ఈ ఫిర్యాదులపై విచారణ జరుపుతున్న కమిటీ 8 మంది ఎన్నారై భర్తల పాస్‌పోర్ట్‌లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

నిందిత వ్యక్తులకు లుక్‌అవుట్ నోటిసు కూడా జారీ చేస్తున్నామని తెలిపింది.ఇదిలాఉంటే వినతులపై మహిళలకి వెసులు బాటు కల్పించే విధంగా మహిళ మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆన్‌లైన్‌లో ఓ కొత్త పోర్టల్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.

ఎన్నారైలకు సంబంధించిన పెళ్లిళ్ల నమోదును కేవలం వారం రోజుల్లోనే గుర్తించే వెసులుబాటును కల్పించాలని అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలను మహిళ మరియు శిశు అభివృద్ధి శాఖా మంత్రి మేనకా గాంధీ ఈ సందర్భంగా కోరారు.

అయితే గతంలో అనుకున్నట్టుగానే భార్యలని వదిలేసినా ఎన్నారై భర్తల ఆస్తుల స్వాధీనంపై ఆలోచన చేస్తున్నామని త్వరలో ఆ విషయంలో ఒక క్లారిటీకి వస్తామని తెలిపారు మేనకా గాంధీ .

వైరల్ వీడియో: కొత్త స్టైల్ లో ఇంట్లో చోరీలకు తెగబడ్డ దొంగలు..