భారతీయుడిని వరించిన అదృష్టం...లాటరీ లో భారీ మొత్తం

పొరుగుదేశాల్లో భారతీయులు ఇటీవల వరుసగా లాటరీలు కొడుతున్నారు.గత నెల కూడా ఒక భారతీయుడు యూఏఈ లో లాటరీ తగిలి బంపర్ ప్రైజ్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.

షార్జాలో నివసిస్తున్న షోజిత్‌ కేఎస్‌ గత నెలలో 15 మిలియన్ల దిర్హామ్‌లు (4.

08 మిలియన్ల అమెరికన్‌ డాలర్లు) గెలుచుకున్నాడు.అయితే ఈ సారి కూడా మరో భారతీయుడినే ఆ అదృష్టం వరించింది.

ఆర్.సంజయ్ నాథ్ అనే వ్యక్తి కి ఏకంగా 2.

7 మిలియన్ ల అమెరికన్ డాలర్ల లాటరీ తగిలినట్లు తెలుస్తుంది.సంజయ్ నాథ్ అనే వ్యక్తి ఇటీవల అబు దాబీ లో లాటరీ టికెట్ కొన్నాడు.

అయితే తాజాగా బంపర్ ప్రైజ్ ని ప్రకటించడం తో అతడికి భారీ లాటరీ లభించడమే కాకుండా ఈ బంపర్ ప్రైజ్ లు అందుకున్న మొదటి 10 మందిలో ఐదుగురు భారతీయులే ఉండడం గమనార్హం.

అబుదాబీలో ‘బిగ్‌ టికెట్’ సంస్థ చాలా కాలంగా లాటరీ ప్రక్రియలను కొనసాగిస్తోంది. """/"/ బంపర్‌ బహుమతులుగా నగదు, లగ్జరీ కార్లను అందిస్తోంది.

ఆన్‌లైన్‌లో లేదా అబు దాబీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ టికెట్లను కొనుగోలు చేస్తారు.

‌ ఈ క్రమంలో సంజయ్ నాథ్ ఈ లాటరీ ని కొనుగోలు చేయగా ఆయనకు 10 మిలియన్ల దిర్హామ్‌లు (2.

7 మిలియన్ల యూఎస్‌డీ) వచ్చాయని యూఏఈ మీడియా మంగళవారం తెలిపింది.అంతేకాదు, ఈ బంపర్‌ ప్రైజ్‌లు అందుకున్న మొదటి 10 మందిలో ఐదుగురు భారతీయులే ఉన్నారని పేర్కొంది.

మరో భారతీయుడు బినూ గోపినాథన్‌ రెండో బహుమతిగా 100000 దిర్హామ్‌లు గెలుచుకున్నాడు.

అమెజాన్ ఫారెస్ట్‌లో అద్భుతమైన తెగ ప్రజలు.. 80 ఏళ్లు దాటినా బలంగా ఉంటారు..?