కెనడాలో గుండెపోటుతో భారతీయ విద్యార్ధిని మృతి, మార్చిలో విదేశాలకు.. అంతలోనే ఇలా

కెనడాలో( Canada ) విషాదం చోటు చేసుకుంది.ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన ఓ భారతీయ విద్యార్ధిని( Indian Student ) గుండెపోటుతో కన్నుమూసింది.

మృతురాలిని పంజాబ్ రాష్ట్రం మాన్సా జిల్లాకు చెందిన బియాంత్ కౌర్ (25)గా( Beant Kaur ) గుర్తించారు.

జీవితంలో గొప్ప స్థాయికి వస్తుందనుకున్న కుమార్తె ఇలా తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో బియాంత్ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

ఆమెను కెనడాకు పంపేందుకు బియాంత్ తండ్రి ఉన్న కాస్త భూమిని విక్రయించాడు.ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న బియాంత్ కుటుంబం ఆమె మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు సహకరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతోంది.

ఈ మేరకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, భటిండా ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్‌లకు ఆమె విజ్ఞప్తి చేసింది.

"""/" / బారాహ్ గ్రామంలో రెండెకరాల భూమి ఉన్న మిథు సింగ్( Mithu Singh ) రెండు నెలల క్రితం తన కుమార్తె బియాంత్ కౌర్‌ను కెనడాకు పంపేందుకు ఒక ఎకరం భూమిని విక్రయించి రూ.

26 లక్షలు సమకూర్చుకున్నారు.కుటుంబ పరిస్ధితిని మెరుగుపరచుకోవాలనే ఆశతో భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసి మార్చి 31న బియాంత్‌ని కెనడాకు పంపానని, కానీ అంతలోనే తన కుమార్తె ఇక లేదనే వార్త వచ్చిందని మిథు సింగ్ కన్నీటి పర్యంతమయ్యారు.

"""/" / ఆమె మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి భారీ మొత్తం ఖర్చవుతుందని .

పలువురు రాజకీయ నాయకులను సంప్రదించినా , ఎటువంటి సహాయం అందలేదని మిథు సింగ్ చెప్పారు.

బియాంత్ తల్లి జస్విందర్ కౌర్( Jaswinder Kaur ) మాట్లాడుతూ.తన కుమార్తెను పెళ్లి బట్టలలో వధువుగా చూడాలని ఎన్నో కలలు కన్నానని.

కానీ ఇప్పుడు అవన్నీ చెదిరిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.తన బిడ్డను చివరిసారి చూసేందుకు వీలుగా భారత్‌కు తీసుకురావడానికి సహకరించాలని సీఎం భగవంత్ మాన్, ఎంపీ హర్‌సిమ్రత్‌ కౌర్‌లకు ఆమె విజ్ఞప్తి చేశారు.

కాగా.గత నెలలో అమెరికాలో సరస్సులో మునిగి ఇద్దరు భారతీయ విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

మృతులను పంజాబ్‌లోని మోహనా గ్రామానికి చెందిన సచిన్ కుమార్ (22), పర్గత్ సింగ్ (27)గా గుర్తించారు.

ఢిల్లీలో ధర్నా : అందరినీ ఏకం చేస్తున్న జగన్