ఖతర్ : స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యంతో భారతీయ చిన్నారి మృతి...!!!

తల్లి తండ్రులు పిల్లలను స్కూల్ కి పంపుతున్నారంటే పిల్లలు స్కూల్ బస్సులో వెళ్లి, మళ్ళీ అదే స్కూల్ బస్సులో ఇంటికి చేరే వరకూ యాజమాన్యానిదే భాద్యత.

ఎంతో నమ్మకంగా స్కూల్ పై నమ్మకాన్ని ఉంచి పిల్లలను తల్లి తండ్రులు ధైర్యంగా పంపుతారు.

కానీ కొన్ని విద్యా సంస్థలు పిల్లల విషయంలో చేస్తున్న అశ్రద్దల కారణంగా పిల్లలు మృతి చెందుతున్న సంఘటనలు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటాయి.

దేశం కాని దేశంలో ఓ భారతీయ జంటకు ఇలాంటి విషాదకర అనుభవం ఎదురయ్యింది.

అసలేం జరిగిందంటే.కేరళకు చెందిన భారతీయ కుటుంభం ఖతర్ లో స్థిరపడింది.

తమకు పుట్టిన గారాల పట్టి మనిషాను స్థానికంగా ఉన్న ఓ స్కూల్ లో చేర్చారు.

నాలుగేళ్ల వయసున్న మనీషా చదువుల్లో ముందుండేది, ఎంతో చలాకీగా స్కూల్ కి వెళ్ళాలని మారం చేయకుండా తల్లి తండ్రులు చెప్పింది చెప్పినట్టు చేసే మనీషా పుట్టిన రోజున కూడా స్కూల్ కి వెళ్ళింది.

సాయంత్రం రాగానే బయటకి వెళ్దామని, పార్టీ చేసుకుందామని తలి తండ్రులు మనీషా కు చెప్పి మరీ స్కూల్ కి పంపారు.

తల్లి తండ్రులకు బై బై చెప్తూ వెళ్ళిన చిన్నారి స్కూల్ యాజమాన్యం చేసిన అలసత్వం కారణంగా మృతి చెందింది.

"""/"/ పుట్టిన రోజున స్కూల్ కి వెళ్ళిన చిన్నారి బస్సులోనే పడుకుండి పోయింది.

బస్సు స్కూల్ కి రాగానే పిల్లలు అందరూ దిగిపోయినా మనీషా పడుకున్న కారణంగా బస్సు లోంచి దిగలేదు.

పైగా బస్సు డ్రైవర్ బస్సులో ఎవరు ఉన్నారు అనేది చూడకుండానే బస్సును లాక్ చేసి వెళ్ళిపోయాడు.

దాంతో చిన్నారికి బస్సులో ఊపిరి ఆడలేదు, బయట నుంచీ వచ్చే వేడి, లోపల ఊపిరి ఆడక పోవడంతో చిన్నారి బస్సులోనే చనిపోయింది.

ఈ విషయం తెలుసుకున్న యాజమాన్యం తల్లి తండ్రులకు విషయం తెలిపి ఆసుపత్రికి తీసుకువెళ్ళినా ఉపయోగం లేకుండా పోయింది.

దాంతో చిన్నారి తల్లి తండ్రులు యాజమాన్యం పై మండిపడ్డారు బస్సు డ్రైవర్, యాజమాన్యాన్ని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయం భారతీయ కమ్యూనిటీ కి తెలియడంతో భారత ఎన్నారైలు కూడా చిన్నారి తల్లి తండ్రులకు మద్దతు తెలుపుతూ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

అక్కినేని ఇంటికి చిన్న కోడలుగా రాబోతున్న జైనాబ్ బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?