పరాయిదేశంలో భారతీయుడి అరెస్ట్...నోటి దూల తీరిపోయిందిగా

నోరు అదుపులో ఉంచుకుంటే చాలు మనిషి జీవితానికి అదే పదివేలు అన్నట్టుగా ఉంది పరాయి దేశంలో ఓ భారతీయుడి పరిస్థితి.

సోషల్ మీడియాలో ఏదైనా పెట్టేసుకోవచ్చు, స్వేచ్చగా ఏదైనా మాట్లడేసుకోవచ్చు అనుకునే వారికి ఈ వార్త కాస్తంత బ్రేకులు వేసినట్టేనని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

కువైట్ దేశంలో అరెస్ట్ అయిన ఓ భారతీయుడు సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ పెట్టానో అంటూ తెగ బాధపడుతున్నాడట.

ఇంతకీ ఏమి జరిగిందనే కదా.సరే అసలు విషయంలోకి వెళ్తే భారత ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త చట్టాల నిర్ణయాలు రాజకీయంగా వివిధ దేశాల్లో పెద్ద చర్చకి దారితీస్తున్నాయి.

కొన్ని చోట్ల నిరసనలు కూడా రేగుతున్నాయి.దేశం కాని దేశం వెళ్ళిన భారతీయులలో కొంతమంది తాజాగా క్యాబ్, ఎన్నార్సీ చట్టాలపై తమ అభిప్రాయాలని వెల్లడిస్తునారు, సోషల్ మీడియాలో తమదైన రీతిలో పోస్టులు కూడా పెడుతున్నారు.

అయితే ఈ పోస్టుల్లో హద్దులు మీరిన కువైట్ లో ఉండే భారతీయుడు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.

"""/" / కేరళాకి చెందిన ఓ భారతీయుడు కువైట్ లోని ఓ హోటల్ లో సూపర్వైజర్ గా చేరాడు.

క్యాబ్ చట్టం గురించి తన అభిప్రాయం తెలుపుతూ ఓ మతం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దాంతో స్థానికంగా ఉన్న భారతీయులు అతడిపై ఆ హోటల్ యజమానికి ఫిర్యాదు చేశారు.

దాంతో హోటల్ యజమాని పోలీసులకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కువైట్ చట్టాల ప్రకారం ఓ మతాన్ని దూషించడం చట్టరీత్యా నేరం అందుకే అతడిని అరెస్ట్ చేశామని తెలిపారు కువైట్ పోలీసులు.

మంగళగిరిలో టీడీపీ రౌడీ రాజకీయం..!!