కన్నీటితో వీడ్కోలు పలికిన భారత ఫుట్బాల్ దిగ్గజం సునీల్ చేత్రీ..

19 ఏళ్ల కెరీర్.జెర్సీ నంబర్ ఎలెవన్.

94 గోల్స్.టీమ్ ఇండియా కెప్టెన్.

కౌంట్‌లెస్‌ మెమరీస్.ఎన్నో చివరికి వీడ్కోలు వీడ్కోలు పలకాల్సిన టైం వచ్చేసింది.

2005లో జాతీయ ఫుట్బాల్ టీం లోకి ఎంట్రీ ఇచ్చిన యువ సంచలనం సునీల్ చత్రి( Sunil Chatri ) అంచలంచలుగా ఎదిగి చివరికి భారతదేశ ఫుట్బాల్ కెప్టెన్ ( Indian Football Captain )గా తన బాధ్యతలను ఎంతో బాధ్యతగా చెమటోడ్చి నిర్వర్తించాడు.

అనేకమార్లు అభిమానులను ఆశ్చర్యపరుస్తూ గోల్స్ సాధిస్తూ వారిని ఆనంద పరిచాడు.అది ఎంతలా అంటే ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో ప్రపంచంలోనే అత్యధిక గోల్స్ సాధించిన నాల్గో వ్యక్తిగా రికార్డ్ సృష్టించాడు.

"""/" / ఈయన ఒక జాతీయ జట్టుకు అత్యధిక గోల్స్ చేసిన వ్యక్తిగా ప్రపంచంలో అందరికంటే రికార్డును సాధించాడు.

ఇకపోతే అంతర్జాతీయంగా అత్యధిక గోల్స్ చేసిన వారిలో నాలుగో వ్యక్తిగా రికార్డ్ సృష్టించాడు.

ఈయన కంటే ముందుగా క్రిస్టియానా రొనాల్డో ( Cristiano Ronaldo )128 గోల్స్.

అలీ దాయ్ 109 గోల్స్.లియోనల్ మెస్సీ 106 గోల్స్.

చేసి ముందుండగా సునీల్ 94 గోల్స్ చేశాడు. """/" / 1984లో సునిల్‌ ఛెత్రి జన్మించాడు.

పుట్టింది ఎక్కడో కాదండోయ్.మన తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో.

అవును మీరు విన్నది నిజమే.ఛెత్రి మన హైదరాబాద్‌లోనే పుట్టాడు.

ఛెత్రి నాన్న ఆర్మీలో జాబ్‌ చేసేవారు కాబట్టి.దేశంలోని అనేక ప్రాంతాలు తిరిగేవారు.

ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.ఛెత్రి నాన్న కేబీ ఛెత్రి.

మదర్‌ సుశీల ఇద్దరూ సాకర్ ప్లేయర్సే.ఇకపోతే భారతదేశంలో క్రికెట్కు ఉన్న ఆదరణ అందరూ ఏ గేమ్ కి లేదని చెప్పవచ్చు.

అయినా కానీ సునీల్ భారత దేశ ఫుట్బాల్ అభిమానుల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలబడిపోతారు.

శుక్రవారం నాడు జరిగిన చివరి మ్యాచ్లో అతడికి పెద్ద ఎత్తున అభిమానులు వీడ్కోలు తెలిపారు.

ఈ యూకే ఖైదీ చాలా డేంజరస్.. 50 ఏళ్లుగా జైల్లోనే..?