ఆవాలకు పెరుగుతున్న అత్యధిక డిమాండ్.. కారణమిదే!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇండోనేషియాలో అమలు చేసిన నిబంధనల కారణంగా ఆవాల ధర అత్యధిక స్థాయికి చేరింది.

అంతర్జాతీయంగా వంటనూనెల లభ్యత, ధరపై గందరగోళం నెలకొన్న నేపద్యంలో ఆవాల ధరలు పెరిగిపోతున్నాయి.

దేశంలో ఆవాలు ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో దీని ధర కనీస మద్దతు ధర (MSP) అత్యధికంగా ఉంది.

దీంతో ప్రస్తుతం ఆవాల ఉత్పత్తి సీజన్ గరిష్టంగా ఉంది.పశ్చిమ బెంగాల్‌లోని ఒక మార్కెట్‌లో ఆవాలు ధర క్వింటాల్‌కు MSP కంటే 3000 రూపాయలకు చేరుకుంది.

ఈసారి ఆవాలు ధర పరంగా రికార్డు స్థాయికి చేరుకుంటుందని ఎడిబుల్ ఆయిల్ పరిశ్రమ నిపుణులు అంటున్నారు.

దీని రేటు MSP కంటే రెండింతలు కావచ్చంటున్నారు.ఎందుకంటే భారతదేశంలో ఎడిబుల్ ఆయిల్స్ డిమాండ్, సప్లై మధ్య దాదాపు 55 శాతం గ్యాప్ ఉంది.

పశ్చిమ బెంగాల్‌లోని బిషున్‌పూర్ (బంకురా) మండిలో ఆవాలు కనిష్ట రేటు రూ.7800 మరియు సగటు ధర రూ.

8100 రూపాయలకు చేరుకుంది.ఇక్కడ గరిష్ట ధర క్వింటాలుకు రూ.

8300 పలికింది.కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.

5050గా నిర్ణయించింది.ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ప్రభుత్వ మండీల్లో ఆవాలు విక్రయించకుండా బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.

దేశంలో 9 శాతం ఆవాలు పశ్చిమ బెంగాల్‌లో ఉత్పత్తి అవుతున్నాయి.ఎడిబుల్ ఆయిల్‌కు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే బహిరంగ మార్కెట్‌లో ఆవాలు క్వింటాల్‌కు రూ.

10,000 వరకు పెరగవచ్చని ఆల్ ఇండియా ఎడిబుల్ ఆయిల్ ట్రేడర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు శంకర్ ఠక్కర్ తెలియజేశారు.

క్యాడర్ ను ఆపేందుకు హరీష్ రావు తంటాలు ! ఎన్నికల అస్త్రం పనిచేస్తుందా ?