Abu Dhabi Big Ticket : మరోసారి భారీ జాక్ పాట్ అందుకున్న భారతీయుడు.. ఈసారి ఎన్ని కోట్లో తెలుసా..?!
TeluguStop.com
గడిచిన కొంతకాలంగా అనేకమంది భారతీయులు వివిధ దేశాలలో లాటరీ లలో( Lottery ) పెద్ద మొత్తంలో డబ్బులను గెలుచుకుంటున్నట్లు మనం వార్తలు చూస్తూనే ఉన్నాం.
తాజాగా జరిగిన అబుదాబి బిగ్ టిక్కెట్ రఫెల్ లో( Abu Dhabi Big Ticket Raffle ) భాగంగా ఓ భారతీయ ప్రవాసుడు జాక్ పాట్ కొట్టేసాడు.
యూనిటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు( UAE ) సంబంధించిన భారతీయుడు ఆదివారం నాడు జరిగిన డ్రాలో ఏకంగా 15 మిలియన్ దిర్హమ్ లను గెలుచుకున్నాడు.
ఈ సొమ్ము భారతీయ కరెన్సీలో ఏకంగా 34 కోట్లు.ప్రవాస భారతీయుడైన మహమ్మద్ షరీఫ్ గడిచిన నెల 23న ఆన్లైన్ లో ఇందుకు సంబంధించి టికెట్ కొనుగోలు చేశాడు.
"""/" /
రాఫిల్ డ్రా నెంబర్ 261 కోసం 186551 నెంబర్ కలిగి ఉన్న టికెట్ నెంబర్ ని కొనుగోలు చేశాడు.
దాంతో ఆయనకు ఊహించని విధంగా జాక్ పాట్ కొట్టేసాడు.బిజినెస్ బేలో ఆయన ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అయితే ఈయన ఈ లాటరీ టికెట్ను తన 19 మంది సహ ఉద్యోగులు కలిసి కొనుగోలు చేయడం గమనార్హం.
దీంతో 19 మంది ఈ లాటరీ టికెట్ సొమ్మును పంచుకోబోతున్నారు.ఇలా చూస్తే ప్రతి ఒక్కరు కనీసం 7,50,000 దిర్హం లు అందుకోబోతున్నారు.
ఇది మనకు కరెన్సీలో దాదాపు కోటి 70 లక్షల రూపాయలకు సమానం. """/" /
ముందుగా ఈ సమాచారాన్ని బిగ్ టికెట్ పోస్టులు లైవ్ ఫోన్ ఇంటర్వ్యూలో భాగంగా ఆయనకు ఫోన్ చేసి విషయం తెలుపగా ఆయన దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇకపోతే తన కుటుంబాన్ని భారత్ నుండి ఇక్కడకు తీసుకురావాలని తన సొంత వ్యాపారాన్ని అతి త్వరగా ప్రారంభించేందుకు ఈ సొమ్ము ఉపయోగపడుతుందని తెలియజేశారు.
అంతేకాదు గెలిచిన సొమ్ములో కొంత భాగాన్ని పేదలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
బాలీవుడ్ ఇండస్ట్రీ దరిద్రానికి కారణాలివే.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్ వైరల్!